Vivo Y58 5G Launch : భారీ బ్యాటరీతో వివో Y58 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?

Vivo Y58 5G Launch : వివో Y58 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో కంపెనీ ఇ-స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Vivo Y58 5G smartphone ( Image Source : Google )

Vivo Y58 5G Launch : కొత్త ఫోన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో వివో వై-సిరీస్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో జూన్ 20న వివో Y58 5జీని లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కృత్రిమ మేధస్సుతో కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ హిమాలయన్ బ్లూ, సుందర్‌బన్స్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

Read Also : Money Stealing Scam : క్రోమ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. ఇలా కాపీ-పేస్ట్ కోడ్ అడుగుతుందా? ఇదో అతిపెద్ద స్కామ్‌..!

వివో Y58 5జీ ధర, వేరియంట్లు :
వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యేందుకు ఇలా క్లిక్ చేయండి :
రూ. 19,499 ధరతో వివో Y58 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఆన్-బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

వివో Y58 5జీ లభ్యత, ఆఫర్‌లు :
వివో Y58 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో కంపెనీ ఇ-స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. పరిచయ ఆఫర్ విషయానికొస్తే.. కస్టమర్‌లు ఎస్బీఐ, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లతో సహా ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల నుంచి రూ. 1,500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

వివో Y58 5జీ వివరాలు :
వివో Y58 5జీ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1024నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. అదనంగా, డిస్‌ప్లే లో బ్లూ లైట్ ఉత్పత్తికి టీయూవీ రైన్‌ల్యాండ్ ద్వారా ధృవీకరించింది. ఇమేజింగ్ విభాగంలో స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ 2ఎంపీ బోకె కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ స్మార్ట్‌ఫోన్ 8ఎంపీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. వివో స్మార్ట్‌ఫోన్ ఏఐ లో లైట్ వంటి ఏఐ ఇమేజింగ్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. యాంబియంట్ లైటింగ్‌లో షూటింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 44డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వివో Y58 5జీ స్పెసిఫికేషన్‌లు :
డిస్‌ప్లే : 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ఎల్‌సీడీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1024నిట్స్ గరిష్ట ప్రకాశం
ప్రాసెసర్ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2
ర్యామ్ : 8జీబీ
స్టోరేజీ : 128జీబీ
బ్యాక్ కెమెరా: 50ఎంపీ+ 2ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 8ఎంపీ
బ్యాటరీ : 6000mAh
ఛార్జింగ్ : 44డబ్ల్యూ వైర్డు
ప్రొటెక్షన్ : ఐపీ64

Read Also : Oppo F27 Pro Plus 5G : ఒప్పో F27ప్రో ప్లస్ 5జీ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు