OnePlus 10 Pro 5G : అద్భుతమైన డిస్కౌంట్.. రూ. 67వేల వన్‌ప్లస్ 5G ఫోన్ జస్ట్ రూ.39,066కే.. DSLR రేంజ్ కెమెరా అదుర్స్!
OnePlus 10 Pro 5G : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. 42శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
OnePlus 10 Pro 5G
- ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే వన్‌ప్లస్ 10 ప్రో 5జీ కొనేసుకోవచ్చు
- ఈ వన్‌ప్లస్ 10 ప్రో 5జీపై నేరుగా రూ. 29 వేల తగ్గింపు పొందవచ్చు
- వన్‌ప్లస్ 10 ప్రో 5జీ కొనుగోలుపై మరెన్నో బ్యాంక్ ఆఫర్లు
OnePlus 10 Pro 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అత్యంత చౌక ధరకే కొత్త వన్‌ప్లస్ 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం వన్‌ప్లస్ 10 ప్రో 5జీపై 42శాతం తగ్గింపు లభిస్తోంది. కంపెనీ అత్యంత పాపులర్ స్మార్ట్ఫోన్లలో ఇదొకటి.
ఈ వన్‌ప్లస్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. 5000mAh కన్నా భారీ బ్యాటరీతో 48MP మెయిన్ (OnePlus 10 Pro 5G) కెమెరాతో వస్తుంది. డీఎస్ఎల్ఆర్ లాంటి క్వాలిటీని ఇస్తుంది. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 10 ప్రో 5జీపై బెస్ట్ ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ధర తగ్గింపు ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 66,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ రూ.39,066కే లభిస్తోంది. లాంచ్ ధర నుంచి ఇదే అత్యంత తక్కువ ధర. ఈ ఫోన్‌పై అసలు ధర నుంచి రూ. 29వేలు డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తోంది. కంపెనీ బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది.
Read Also : Air Cooler Tips : కొత్త కూలర్ కొనేముందు అందరూ చేసే 5 పెద్ద మిస్టేక్స్ ఇవే! మర్చిపోతే మీకే నష్టం..!
వన్‌ప్లస్ 10 ప్రో 5జీ బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ :
వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 2,429 తగ్గింపు లభిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ రూ. 31వేల వరకు తగ్గింపు పొందింది. తద్వారా ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 36,637కే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 10 ప్రోలో 6.7-అంగుళాల QHD+ (1,440×3,216 పిక్సెల్స్) కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. డైనమిక్ రిఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz మధ్య యాస్పెక్ట్ రేషియో 20.1:9 ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు LPDDR5 ర్యామ్ కూడా ఉంది.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/1.8 లెన్స్ OIS సపోర్ట్‌తో 48MP సోనీ IMX789 ప్రైమరీ సెన్సార్ ఉంది. అదనంగా, ఎఫ్/2.2 అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 50MP శాంసంగ్ ఐసోసెల్ JN1 సెన్సార్ కూడా ఉంది. చివరగా, OIS సపోర్ట్‌తో 8MP టెలిఫోటో షూటర్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది.
ఈ ఫోన్లో 5,000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ కొలతలు 163×73.9×8.55mm బరువు, 200.5 గ్రాములు ఉంటుంది.
