Vivo Y6a Launch : వావ్.. మిడిల్ క్లాసు వాళ్లకు పర్ఫెక్ట్ ఫోన్ మావా.. వివో Y6a ఫీచర్లు చూస్తే నమ్మలేరు!

Vivo Y6a Launch : వివో కొత్త వివో Y6a లాంచ్ చేసింది. ఇందులో 7200mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ 120Hz డిస్‌ప్లే ఉన్నాయి. పూర్తి వివరాలివే..

Vivo Y6a Launch

  • వివో Y6a ఫోన్ 7200mAh బ్యాటరీతో లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 120Hz డిస్‌ప్లే ఆప్షన్
  • IP68/IP69 రేటింగ్ 50MP రియర్ కెమెరా సెటప్

Vivo Y6a Launch : కొత్త వివో ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. వివో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వివో Y6a వచ్చేసింది. ఈ కంపెనీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7200mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే 50MP రియర్ కెమెరా కూడా ఉన్నాయి. బ్యాటరీ పరంగా పరిశీలిస్తే.. ఆరేళ్ల వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వివో Y6a ఫోన్ ఫీచర్లు, ధర వివరాలపై లుక్కేయండి..

చైనాలో వివో Y6a ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో లాంచ్ అయింది. ఈ వివో ఫోన్ ధర 1,999 యువాన్లు (సుమారుగా రూ. 27,750)కు లభిస్తోంది. గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్ ఫీనిక్స్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో ఈ వివో లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.

Read Also : Amazon Prime Day 2026 Sale : గెట్ రెడీ గాడ్జెట్ లవర్స్.. జూలై 4 నుంచి షాపింగ్ జాతర.. ఈ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు..!

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వివో Y6a ఫోన్ 6.75-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB LPDDR4X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ ద్వారా ర్యామ్ 16GB వరకు విస్తరించవచ్చు.

ఈ ఫోన్‌లో 7200mAh బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 1800 ఛార్జ్ సైకిల్స్ వరకు రన్ అవుతుంది. 6 ఏళ్ల వరకు పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో Y6aలో 50ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదు. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఆప్షన్ ఉంది. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 4.2, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. కంపెనీ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తాయి.