Vodafone-Idea reveals eligible Xiaomi phones for 5G support, but when will it launch 5G in India_
Vodafone-Idea 5G : మీరు వోడాఫోన్ ఐడియా (Vodafone-idea) వినియోగదారులా? అయితే, మీరు వాడే స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేస్తుందా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) ఫోన్లు వాడే వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. Vodafone-Idea (Vi) 5G సర్వీసులకు సపోర్టు చేసే Xiaomi ఫోన్‌ల జాబితాను కంపెనీ ప్రకటించింది. అనేక Xiaomi, Redmi ఫోన్‌లలో లేటెస్ట్ నెట్‌వర్క్‌ను టెస్టింగ్ చేసినట్టు టెలికాం దిగ్గజం వెల్లడించింది.
Vi వినియోగదారులు లేటెస్ట్ 5G నెట్‌వర్క్‌ను పొందడానికి అర్హత ఉన్న డివైజ్‌ల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందించనుంది. Xiaomi, Redmi భాగస్వామ్యంతో ఆయా బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు Vi 5G సర్వీసుల్లో మెరుగైన డేటాను పొందడానికి వీలు కల్పిస్తుందని టెలికాం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) మాదిరిగా కాకుండా Vi (Vodafone idea) ఇంకా భారత్‌లోని ఏ నగరాల్లోనూ 5Gని లాంచ్ చేయలేదు. Vi 5G లాంచ్ గురించి ఇప్పటివరకు పూర్తి వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు.
భారత్‌లో Vi 5G లాంచ్ ఎప్పుడంటే? :
ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా తెలియదనే చెప్పాలి. వోడాఫోన్ ఐడియా 2024 నాటికి భారత మార్కెట్లో 5Gని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. కానీ, Vodafone-Idea అనేక Xiaomi డివైజ్‌లలో లేటెస్ట్ నెట్‌వర్క్‌ను టెస్టింగ్ చేసింది. Vi కంపెనీ త్వరలో 5Gని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి, భారత్‌లో వివిధ ప్రాంతాలకు Vi 5G ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. టెల్కో ఇప్పటికీ 5G నెట్‌వర్క్ టెస్టింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
Vodafone-Idea reveals eligible Xiaomi phones for 5G support
Vi 5Gకి అర్హత ఉన్న ఫోన్‌ల జాబితా :
5G నెట్‌వర్క్‌కు అర్హత ఉన్న ఫోన్ డివైజ్‌ల జాబితాను కంపెనీ వెల్లడించింది. ఇందులో Xiaomi 13 Pro, Redmi Note 12 Pro 5G, Redmi 11 Prime 5G, Redmi K50i, Redmi Note 12 Pro+ 5G, Redmi Note 12 5G, Xiaomi 12 Pro, Mi 11 Ultra ఉన్నాయి. ఈ జాబితాలో Mi 11X Pro, Xiaomi 11T Pro 5G, Redmi Note 11T 5G, Xiaomi 11 Lite NE 5G, Redmi Note 11 Pro 5G, Mi 11X, Mi 10, Mi 10T, Mi 10T Pro, Mi 10i ఫోన్లు కూడా ఉన్నాయి.
ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) ఇప్పుడు వందలాది భారతీయ నగరాల్లో 5Gని అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్లకు 5G సర్వీసులను అందిస్తున్నాయి. ఇప్పటికీ 5G నెట్‌వర్క్ ఇంకా 4G మాదిరిగా స్టేబుల్‌గా లేనప్పటికీ, యూజర్లు తమ సపోర్టెడ్ ఫోన్‌లలో 5Gని టెస్టింగ్ చేసుకోవచ్చు. జియో ఇటీవల 406 భారతీయ నగరాల్లో 5Gని లాంచ్ చేసింది. అయితే, ఎయిర్‌టెల్ మాత్రం 500 నగరాల్లో 5G సర్వీసులను అందిస్తోంది.