టెలికాం రంగంలో కంపెనీలు కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న Jioను ఢీకొట్టడానికి పలు సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో Vodfone ఒకటి. తాజాగా కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు మాత్రమేనని ప్రకటించింది ఆ సంస్థ. రూ. 99, రూ. 555 పేరిట ప్లాన్స్ లభిస్తున్నాయి. రూ. 99 రీ ఛార్జ్ చేసుకుంటే..1GB Data, 100 SMSలు, అన్ లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్‌ను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. ఈ ప్లాన్ మాత్రం 18 రోజులు మాత్రమే ఉంటుందని తెలిపింది.
ఇక రూ. 555 ప్లాన్ విషయానికి వస్తే.. రోజుకు 1.5 GB Data, 100 SMSలు, అన్ లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తామని వెల్లడించింది. అయితే..ఈ ప్లాన్ వాలిడిటీని పెంచారు. 70 రోజుల పాటు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. కానీ ఈ రెండు ప్లాన్స్ కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. రూ. 99 ప్లాన్ కొల్ కతా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒరిస్సా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటే..రూ. 555 ప్లాన్ ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై వినియోగదారులకు వర్తించనుంది.
Read More : టీమిండియా గెలిచి నిలిచేనా : సిరీస్‌పై ఆసీస్ కన్ను