Free JioHotstar : వావ్.. అద్భుతం.. జియోహాట్‌స్టార్ 3 నెలలు ఫ్రీ.. 50GB వరకు హైస్పీడ్ డేటా.. జియో, Vi, ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్లు
JioHotstar : జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా మీ నెట్ వర్క్ ఏదైనా ఈ చీపెస్ట్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 50GB డేటాతో పాటు 3 నెలల వరకు జియోహాట్ స్టార్ యాక్సస్ చేయొచ్చు. అది ఎలాగంటే?
- Sreehari A
- Published On : March 15, 2026 / 04:49 PM IST
Free JioHotstar
- జియోహాట్‌స్టార్ కొత్త సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారా?
- ఈ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లతో 3 నెలలు ఫ్రీగా పొందొచ్చు
- జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలో ఏది బెటర్?
JioHotstar : మీకు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. మీ నెట్ వర్క్ ఏదైనా సరే మూడు నెలల పాటు ఉచితంగా జియోహాట్ స్టార్ పొందవచ్చు. జియోహాట్ స్టార్‌లో సినిమాలు, షోలు అన్ని చూడొచ్చు. 3 నెలల పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఎలా పొందాలో తెలుసా? మీరు ముందుగా మీ మొబైల్ నెట్ వర్క్ నుంచి ఏదైనా ఒక రీఛార్జ్ ప్లాన్ తీసుకోవాలి.
ప్రస్తుతం మార్కెట్లో 3 నెలల ఫ్రీ (JioHotstar)తో వచ్చే కొన్ని సరసమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 50GB వరకు డేటా, 3 నెలల వరకు జియోహాట్‌స్టార్ యాక్సస్ పొందవచ్చు. మీరు కూడా ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఏది కావాలో ఎంచుకోండి.
ఎయిర్‌టెల్ రూ. 195 డేటా ప్యాక్ :
ఈ డేటా ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 12GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలలు), ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ (20+ OTT ఛానెల్‌లు) ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ. 361 డేటా ప్యాక్ :
ఈ డేటా ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 50GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలల పాటు) అందిస్తుంది.
జియో రూ. 195 డేటా ప్యాక్ :
ఈ డేటా ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 15GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ (90 రోజుల పాటు) ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా రూ. 151 డేటా ప్యాక్ :
ఈ డేటా ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 4GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలలు) ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా రూ. 169 డేటా ప్యాక్ :
ఈ డేటా ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 8GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (90 రోజులు) ఉంటుంది.
