Gautam Adani Joins Elon Musk, Jeff Bezos In Exclusive 100 Billion Dollars Club (2)
WhatsApp Aaccounts Ban : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ Whatsapp పలు భారతీయ అకౌంట్లపై నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఫిబ్రవరి 2022లో 14.26 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. వాట్సాప్ నెలవారీ నివేదిక ప్రకారం.. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వాట్సాప్ యూజర్ల ఉల్లంఘనలకు సంబంధించి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించినట్టు వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 28 మధ్య 335 ఫిర్యాదుల నివేదికలు అందాయని తెలిపింది. మరో 21 వాట్సాప్ అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. మొత్తం నివేదికలలో 194 ఫిర్యాదుల్లో ఆయా అకౌంట్లపై నిషేధం విధించాలని, అకౌంట్ సపోర్టు, ప్రొడక్టు సపోర్టు, భద్రవత విభాగానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
కొన్ని ఫేక్ ఫిర్యాదులు కూడా అందాయని, వాటి మినహా వాట్సాప్ అన్ని ఫిర్యాదులపై స్పందించినట్టు తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా వాట్సాప్ అకౌంట్ నిషేధం విధించే అవకాశం ఉంటుంది. కొన్ని ఏళ్లుగా.. వాట్సాప్ తమ యూజర్ల కోసం ప్లాట్‌ఫారమ్‌లో సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా సైంటిస్టులు, నిపుణులతో స్థిరంగా పెట్టుబడి పెడుతోంది.
Read Also : WhatsApp View Once : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. చాట్‌లో పాప్-అప్ మెనూ..!