WhatsApp View Once : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. చాట్‌లో పాప్-అప్ మెనూ..!

WhatsApp View Once : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్‌లో View Once పేరుతో ఈ కొత్త ఫీచర్ రాబోతోంది.

WhatsApp View Once : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. చాట్‌లో పాప్-అప్ మెనూ..!

Whatsapp Testing 'view Once' Feature For Windows Users, New Pop Up Menu For Phone Numbers In Chats

WhatsApp View Once : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్‌లో View Once పేరుతో ఈ కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యూనివర్శల్ విండోస్ ప్లాట్ ఫారమ్ (UWP) యాప్ బీటాలో గుర్తించారు. విండోస్ యూజర్ల కోసం ప్రత్యేకించి వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అందులోభాగంగానే WhatsApp Windowsలో కొత్త ‘View Once’ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ పాప్ అప్ మాదిరిగా కనిపించనుంది. WhatsApp చాట్ బాక్సులో ఫోన్ నంబర్‌లకు సంబంధించి కొత్త పాప్-అప్ మెను వస్తుంది.

WhatsApp ఫీచర్స్ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. Windows Beta 2.2212.2.0 వెర్షన్.. WhatsApp ‘View Once’ ఫీచర్‌’ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ టెస్టింగ్ స్ర్కీన్ షాట్ షేర్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప చాట్ బాక్సులో ఏదైనా ఫోటో లేదా వీడియోను ఒకసారి మాత్రమే చూడటానికి వీలుంటుంది. ఆ తర్వాత ఆ ఇమేజ్ దానంతంట అదే డిలీట్ అయిపోతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు గత ఏడాదిలో ‘View Once’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో షేర్ చేసే ఫోటోలు, వీడియోలను చాట్ బాక్సులో వీక్షించిన తర్వాత చాట్ నుంచి అదృశ్యమవుతాయి. అయితే, ఈ ఫీచర్‌ని ఉపయోగించి షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను చూడగానే వెంటనే స్క్రీన్‌షాట్‌లు లేదా స్క్రీన్ రికార్డింగ్‌ ద్వారా ఫోన్లలో సేవ్ చేసుకోవచ్చు.

Whatsapp Testing 'view Once' Feature For Windows Users, New Pop Up Menu For Phone Numbers In Chats (1)

Whatsapp Testing ‘view Once’ Feature For Windows Users, New Pop Up Menu For Phone Numbers In Chats 

Windows బీటా టెస్టర్‌లో బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ బీటా 2.22.8.11 తీసుకొస్తోంది. WhatsApp చాట్‌లో ఏదైనా ఫోన్ నంబర్‌ను ఒకసారి నొక్కిన తర్వాత మీకు పాప్-అప్ మెనుతో డిస్ ప్లే అవుతుంది. అది డిఫాల్ట్ యాప్‌ను ఉపయోగించి నేరుగా నంబర్‌ను డయల్ చేయడానికి లేదా మీ కాంటాక్టుల లిస్టును యాడ్ చేసేందుకు ఆఫ్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఫోన్ నంబర్ ఇప్పటికే WhatsAppలో యాక్టివ్‌గా ఉంటే.. మెను ద్వారా ఆయా యూజర్లకు నేరుగా చాట్ చేసుకోవచ్చు.

WABetaInfo కొత్త పాప్-అప్ మెను కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సాధారణ వాట్సాప్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఖచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా, WhatsApp యూజర్లు తమ చాట్‌లోని ఫోన్ నంబర్‌ను ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత డిఫాల్ట్ డయలర్ యాప్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అయితే, చాట్‌ల లిస్టులో చాట్ బటన్ తప్పుగా కనిపించడానికి కారణమైన సమస్యను WhatsApp ఫిక్స్ చేసిందని WABetaInfo నివేదించింది. Android బీటా వెర్షన్ 2.22.8.10 WhatsAppలో ఒక భాగంగా ఉండనుంది.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఐఫోన్ యూజర్లు త్వరలో 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు!