WhatsApp iPhone Users : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఐఫోన్ యూజర్లు త్వరలో 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు!

WhatsApp iPhone Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడే ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఐఫోన్ వాట్సాప్ ఐఓఎస్ ద్వారా 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు.

WhatsApp iPhone Users : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఐఫోన్ యూజర్లు త్వరలో 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు!

Whatsapp Iphone Users Whatsapp May Soon Let Iphone Users Send Up To 2gb Files

WhatsApp iPhone Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడే ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఐఫోన్ వాట్సాప్ ఐఓఎస్ ద్వారా 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు. ఇప్పటివరకూ 100MB ఫైల్స్ మాత్రమే పంపుకునేందుకు వీలుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా రానున్న రోజుల్లో 2GB వరకు ఫైల్స్ ఏమైనా ఒకరినొకరు పంపుకోవచ్చు. సాధారణంగా వాట్సాప్ నుంచి బిగ్ ఫైల్స్ పంపాలనుకుంటే.. క్లౌడ్ స్టోరేజీ యాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా పంపుకునే వీలుంది. అయితే ఇకపై వాట్సాప్ ద్వారానే పెద్ద సైజు మీడియా ఫైల్స్ పంపుకోవచ్చు.

WABetaInfo ప్రకారం… WhatsApp 2GB సైజులో ఉండే ఫైల్‌లను పంపేందుకు అవసరమైన యాప్ సామర్థ్యాన్ని టెస్టు చేస్తోంది. ఇప్పటికే టెలిగ్రామ్ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా.. ఐఫోన్ యూజర్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా టెస్టింగ్ నిర్వహిస్తోంది వాట్సాప్.

Whatsapp Iphone Users Whatsapp May Soon Let Iphone Users Send Up To 2gb Files (1)

Whatsapp Iphone Users Whatsapp May Soon Let Iphone Users Send Up To 2gb Files

వాట్సాప్‌లో iOS బీటా వెర్షన్ 22.7.0.76 కోసం లేటెస్ట్ WhatsApp iOS 15కి ఫుల్ సపోర్టు చేస్తుందని నివేదిక తెలిపింది. మెటా యాజమాన్యంలోని యాప్ iOSలో గరిష్టంగా 2GB ఫైల్ ట్రాన్స్‌ఫర్ సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లు వాట్సాప్ చాట్ ద్వారా 100MB వరకు మీడియా ఫైల్‌లను మాత్రమే పంపే వీలుంది.

కానీ, ఇప్పుడు మెసేజింగ్ యాప్‌లలో మీడియా ఫైల్‌లను పంపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వాట్సాప్‌ ఈ ఫీచర్ త్వరలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం అర్జెంటీనాలో టెస్టింగ్ నిర్వహిస్తోంది. ఐఫోన్ వాట్సాప్ యాప్ నుంచి 2GB సైజు డాక్యుమెంట్‌లను పంపుకోవచ్చు.. వాట్సాప్ ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకవస్తుందో రివీల్ చేయలేదు.

Read Also :  Protect Credit Cards : మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు జాగ్రత్త.. 6 సెకన్లలో హ్యాక్ చేసేస్తారు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి