Protect Credit Cards : మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు జాగ్రత్త.. 6 సెకన్లలో హ్యాక్ చేసేస్తారు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి

Protect Credit Cards : క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? జర జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు కన్నేశారు. మీకు తెలియకుండానే మీ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను తస్కరించే అవకాశం ఉంది.

Protect Credit Cards : మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు జాగ్రత్త.. 6 సెకన్లలో హ్యాక్ చేసేస్తారు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి

Protect Credit Cards : క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? జర జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు కన్నేశారు. మీకు తెలియకుండానే మీ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను తస్కరించే అవకాశం ఉంది. మీ కార్డులను హ్యాక్ చేసి మీ అకౌంట్లలో డబ్బులను దొంగలించే అవకాశం ఉంది. అందుకే మీ కార్డు వివరాలను ఎప్పుడు మరొకరితో షేర్ చేయరాదు. అలాగే కార్డులపై పిన్ నెంబర్లను రాసుకోకూడదు. అలా చేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లకు మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు చిక్కితే కేవలం మీ కార్డులను కేవలం 6 సెకన్ల వ్యవధిలోనే హ్యాక్ చేసేస్తారని ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ గ్లోబల్‌ VPN సర్వీసెస్‌ ప్రొవైడర్‌ NordVPN అనే సంస్థ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల హ్యకింగ్‌పై నివేదిక వెల్లడించింది.

కరోనా కారణంగా ఆన్‌లైన్ లావాదేవీలు భారీగా పెరిగాయి. డిజిటల్‌ పేమెంట్స్ చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. సైబర్‌ నేరస్తులు ఇదే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అమాయకులను నమ్మించి వారి వివరాలను తస్కరిస్తున్నారని నార్డ్‌ వీపీఎన్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 140 దేశాల్లోని 40 లక్షల క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్లను పరిశీలించగా.. బ్రూట్ ఫోర్స్ ద్వారా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఎక్కువగా హ్యాక్ చేస్తున్నారని తేలింది. హైటెక్ మోసాలు జరుగుతున్న ఈ రోజుల్లో కేవలం సెకన్ల వ్యవధిలోనే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను స్వాహా చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

డార్క్‌ వెబ్‌లో భారీ సంఖ్యలో క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్స్ వివరాలు బహిర్గతమయ్యాయని నివేదిక వెల్లడించింది. దీనికి వెనుక బ్రూట్ ఫోర్స్‌ హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ బ్రూట్ ఫోర్స్ విభాగం డెబిట్‌, క్రెడిట్‌ కార్డు కస్టమర్ల నెంబర్లను, సీవీవీ (CVV)ను అంచనా వేస్తున్నారని NordVPN చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరిజూస్ బ్రిడీస్ తెలిపారు. కార్డుల్లోని మొదటి 6-8 డిజిట్స్ కార్డు ఇష్యూ చేసే ఐడీ నెంబర్ ఉంటుంది.. ఆ తర్వాత 7-9 నెంబర్లను సైబర్ నేరగాళ్లు సులభంగా అంచనా వేయగలరని తేలింది. అందుకే సైబర్ నేరగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సులభంగా హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని నివేదిక తెలిపింది.

Your Credit, Debit Card Can Be Hacked In Just 6 Second. Here's How You Can Protect Yourself (1)

Your Credit, Debit Card Can Be Hacked In Just 6 Second. Here’s How You Can Protect Yourself 

క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై సాధారణంగా 16 అంకెల డిజిట్ యూనిక్ నెంబర్ ఉంటుంది. అయితే ఆ కార్డులకు సంబంధించి కాంబినేషన్ల గుర్తించడానికి హ్యాకర్లు స్పెషల్ కంప్యూటర్ వాడుతున్నారట.. ఈ కంప్యూటర్ల ద్వారానే కార్డుల వివరాలను సేకరించి హ్యాకింగ్ చేస్తున్నారని గుర్తించారు. గంటకు 25 బిలియన్ కాంబినేషన్ కార్డులను సైబర్ నేరగాళ్లు చెక్ చేయగలరని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డులను హ్యాక్ చేయడానికి వారికి 6 సెకన్ల సమయం సరిపోతుందని నివేదిక తెలిపింది.

కార్డు ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా?
మీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు యూజర్లకు RBI ఎప్పటికప్పుడూ హెచ్చరికలను జారీ చేస్తోంది. ఈ కింది సూచనలు పాటిస్తే చాలు.. మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను సైబర్ నేరగాళ్ల బారనపడకుండా జాగ్రత్తపడవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు యూజర్లు నెలవారీ స్టేట్‌మెంట్‌లను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలి. మీ బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి సెక్యూర్ నోటిఫికేషన్‌కు అప్రమత్తం కావాలి. మీ బ్యాంకు అకౌంట్లో అధిక మొత్తంలో డబ్బులు ఉంచుకోరాదు. తక్కువ మొత్తంలోనే డబ్బులు ఉంచుకుంటే మంచిది. అనుకోని అవసరాల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వినియోగదారులు బ్యాంకులు అందించే తాత్కాలిక వర్చువల్ కార్డులతో పేమెంట్స్ చేసుకోవాలి. టెలిఫోన్‌లు, ఈ-మెయిల్స్‌ ద్వారా ఫ్రాడ్ యాడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Read Also : Credit-Card Fees : క్రెడిట్ కార్డు యూజర్లకు షాకింగ్.. ఆ కార్డుల ఫీజులు పెరుగుతున్నాయి..!