WhatsApp Accounts Ban : 65 లక్షల భారతీయ వాట్సాప్ యూజర్ల అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

WhatsApp Accounts Ban : మే 2023లో 65 లక్షల భారతీయ వాట్సాప్ యూజర్ల అకౌంట్లను నిషేధించింది. మే 1 నుంచి మే 31 వరకు సేకరించిన డేటా ప్రకారం.. 65,08,000 అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది.

WhatsApp banned over 65 lakh Indian users in May amid rising cases of online scams

WhatsApp Accounts Ban : భారత్‌లో ఆన్‌లైన్ స్కామ్‌ల కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త స్కామ్ కేసులు నమోదవుతున్నాయి. మెటా మెసేజింగ్ యాప్ (WhatsApp) ఈ మోసాలకు హాట్‌స్పాట్‌లలో ఒకటిగా మారుతోంది. స్కామర్లు వాట్సాప్ మెసేజ్‌లు లేదా కాల్స్ ద్వారా వినియోగదారుల నుంచి లక్షల్లో దోచుకుంటున్నారు.

ఈ స్కామర్‌లను ఎదుర్కోవడానికి.. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా మార్చే పనిలో పడింది. యూజర్ల రిపోర్టులను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటీవల మే 2023లో నెలవారీ యూజర్ భద్రతా నివేదికను మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ రిలీజ్ చేసింది. యూజర్ల ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత 65 లక్షల మంది భారతీయ యూజర్లను నిషేధించిందని పేర్కొంది.

Read Also : WhatsApp Beta Users : వాట్సాప్ యూజర్లు.. ఇకపై హై-క్వాలిటీ వీడియోలను కూడా పంపుకోవచ్చు..!

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 4(1)(D), రూల్ 3A(7) ప్రకారం వాట్సాప్ నెలవారీ భారతీయ అకౌంట్ల రిపోర్టును రిలీజ్ చేస్తుంది. రిపోర్టు ఫిర్యాదుల నివేదికల సంఖ్యపై సమాచారాన్ని అందిస్తుంది. అందులో యూజర్ల నుంచి స్వీకరించన రిపోర్టులపై తగిన చర్యలు తీసుకుంటుంది. వాట్సాప్ యూజర్లు సమర్పించిన అన్ని రిపోర్టులను శ్రద్ధగా రివ్యూ చేస్తుందని, సంస్థ సేవా నిబంధనలను ఉల్లంఘించే అకౌంట్లపై తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తుంది.

స్పామ్, స్కామ్‌లు, వాట్సాప్ యూజర్ల భద్రతకు హాని కలిగించే ఏదైనా అనుమానిత ప్రవర్తన వంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తుంది. మే 1 నుంచి మే 31 వరకు సేకరించిన డేటాకు సంబంధించి రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ భారత్‌లో 65,08,000 అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఏవైనా రిపోర్టులు రాకముందే  (24,20,700) అకౌంట్లు ముందస్తుగా నిషేధించిందని నివేదిక తెలిపింది.

WhatsApp Accounts Ban : WhatsApp banned over 65 lakh Indian users in May amid rising cases of online scams

వాట్సాప్ నివారణ, గుర్తింపు చర్యల ద్వారా మిగిలిన అకౌంట్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంది. వాట్సాప్ 3,912 ఫిర్యాదుల రిపోర్టులు కూడా అందాయి. అందులో నుంచి 297 అకౌంట్లపై చర్యలు తీసుకుంది. దుర్వినియోగాన్ని గుర్తించడం అనేది అకౌంట్ జీవనశైలి మూడు దశల్లో పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ వద్ద, మెసేజింగ్ సమయంలో, నెగటివ్ అభిప్రాయానికి రిప్లయ్ ఇవ్వడం, యూజర్ల రిపోర్టులను బ్లాక్‌ల రూపంలో పొందుతుంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో అగ్రగామిగా భద్రతా ఫీచర్లు, నియంత్రణలతో పాటు, ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, పరిశోధకులు, చట్ట అమలులో నిపుణుల బృందాన్ని నియమిస్తుంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల భద్రతను నిర్ధారించడానికి అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది.

ఈ ఫీచర్‌లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్, ఫార్వర్డ్ లిమిట్స్ వంటి మరిన్ని ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ నిబంధనలు, షరతులను ఉల్లంఘిస్తే ఆయా యూజర్లపై రిపోర్టు చేయడానికి బ్లాక్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఇటీవలే, వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అదనపు భద్రత కోసం యూజర్లు తమ చాట్‌లను లాక్ చేసేందుకు అనుమతిస్తుంది.

అదనంగా, వాట్సాప్ స్పెషల్ ప్రైవసీ చెకింగ్ ఫీచర్‌ను కూడా యాడ్ చేసింది. వినియోగదారులు వారి అకౌంట్లలో అన్‌లాక్ చేసిన ప్రైవసీ సెట్టింగ్‌లు, ఫీచర్లను నిశితంగా పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది. ఈ చర్యలు ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు యూజర్ల ప్రైవసీని మెరుగుపరచడంతో పాటు సమాచారాన్ని ప్రొటెక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read Also : Honda Elevate Bookings : కొత్త కారు కావాలా? హోండా ఎలివేట్ బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.. సెప్టెంబర్‌లోనే లాంచ్!