WhatsApp brings new shortcuts for Group admins on iPhone
WhatsApp Group Admins : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఆపిల్ App Storeలో లేటెస్ట్ 23.1.75 అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. WaBetaInfo నివేదిక ప్రకారం.. ఈ అప్‌డేట్ గ్రూప్ అడ్మిన్‌ల కోసం కొత్త షార్ట్‌కట్‌లను తీసుకువస్తుంది. ఈ షార్ట్‌కట్‌లు వాట్సాప్ గ్రూప్‌లోని గ్రూప్ అడ్మిన్‌లు నిర్దిష్ట కాంటాక్ట్ కోసం సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.
వాట్సాప్ కొత్త షార్ట్‌కట్‌లు ఏంటి? :
నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఇప్పుడు గ్రూప్‌లో పాల్గొనేవారు జాయిన్ అయినప్పుడు లేదా ఎగ్జిట్ అయినప్పుడు యూజర్ కాంటాక్టు నంబర్‌ను హైలైట్ చేస్తుంది. కొత్త అప్‌డేట్‌తో, గ్రూప్ అడ్మిన్‌లు వాట్సాప్‌లో త్వరగా కాల్‌లు చేసేందుకు కాంటాక్ట్ నంబర్‌ను Tap చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ పార్టిసిపెంట్‌లతో ప్రైవేట్‌గా కూడా చాట్ చేయవచ్చు. WhatsApp లేటెస్ట్ iOS వెర్షన్‌తో యాడ్ చేసిన ఇతర ఫోన్ నంబర్‌ను కాపీ చేయగల సామర్థ్యంతో అడ్రస్ బుక్‌లో గ్రూప్ పార్టిసిపెంట్‌లను యాడ్ చేయాలి.
WaBetaInfo నివేదిక ప్రకారం.. వాట్పాప్ షార్ట్‌కట్‌లు ‘గ్రూపులలో యూజర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. చాలా మంది వాట్పాప్ యూజర్లు పాల్గొనేవారిలో నిర్దిష్ట కాంటాక్టును గుర్తించాల్సి ఉంటుంది. లేటెస్ట్ WhatsApp iOS అప్‌డేట్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ షార్ట్‌కట్‌లను ఉపయోగించాలంటే iPhone యూజర్లు తమ డివైజ్‌లలో వాట్పాప్ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
WhatsApp brings new shortcuts for Group admins on iPhone
WhatsApp త్వరలో ఒరిజినల్ క్వాలిటీతో ఇతర కాంటాక్టుల ఫోటోలను షేర్ చేసేందుకు యూజర్లను అనుమతించవచ్చు. ప్రస్తుతం, WhatsApp ద్వారా షేర్ చేసిన ఫొటోలను కంప్రెస్ అవుతాయి. ఫలితంగా గ్రైనీ ఫోటోలు ఉంటాయి. కానీ, WaBetaInfo ప్రకారం.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను పంపగల సామర్థ్యంపై కంపెనీ కృషి చేస్తోంది.
ఆండ్రాయిడ్ 2.23.2.11 అప్‌డేట్ WhatsApp బీటాలో ఫీచర్ ఉందని WaBetaInfo ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్లాట్‌ఫారమ్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, మెసేజింగ్ యాప్ డ్రాయింగ్ టూల్ హెడర్‌లో కొత్త సెట్టింగ్ ఐకాన్ యాడ్ చేయాలని యోచిస్తోంది. కొత్త ఐకాన్ యూజర్లను వారి ఒరిజినల్ క్వాలిటీతో సహా ఫొటో క్వాలిటీని కాన్ఫిగర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫొటోల క్వాలిటీపై వారికి మరింత కంట్రోల్ అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..