WhatsApp New Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఇకపై లింక్ చేసిన డివైజ్‌ల్లో కూడా చాట్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు..!

WhatsApp New Update : వాట్సాప్ త్వరలో కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. వినియోగదారులకు వారి చాట్‌లను లింక్ చేసిన డివైజ్‌లలో సురక్షితంగా ఉంచేలా మెరుగైన భద్రతా చర్యలను అందిస్తుంది.

WhatsApp could release new update to keep your chats protected across linked devices

WhatsApp New Update : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేయనుంది. వినియోగదారులకు వారి చాట్‌లను లింక్ చేసిన డివైజ్‌లలో సురక్షితమైన మెరుగైన సెక్యూరిటీని అందిస్తుంది.అయితే లింక్డ్ డివైజ్ ఫంక్షనాలిటీ కాంటాక్టు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో మెసేజ్‌లను సులభంగా సింకరైజ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇప్పుడు, లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఆండ్రాయిడ్ 2.24.4.14 అప్‌డేట్‌లో రానుంది.

Read Also : BlueSky Twitter Clone : ట్విట్టర్ క్లోన్ వెర్షన్ ‘బ్లూస్కై’ ఇకపై అందరికి అందుబాటులోకి.. ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?

ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు తమ డివైజ్ పాస్‌కోడ్, ఫేస్ ఐడీ, ఫింగర్ ఫ్రింట్ లేదా సీక్రెట్ కోడ్ వెనుక చాట్‌లను లాక్ చేసే ఆప్షన్ కలిగి ఉంది. ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రైమరీ డివైజ్‌కు పరిమితం చేసింది. అయితే, వాట్సాప్ ఇప్పుడు వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని లింక్ చేసిన డివైజ్‌లకు చాట్ లాక్ ప్రొటెక్షన్ అందించే సింకరైజ్ యాక్టివిటీపై పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

డెవలప్ స్టేజీలో కొత్త ఫీచర్ :
వాట్సాప్ యూజర్లు ఒక డివైజ్‌లోని చాట్‌ను లాక్ చేసినప్పుడు అది వెబ్, విండోస్, మ్యాక్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా అన్ని లింక్ చేసిన డివైజ్‌లలో ఆటోమాటిక్‌గా లాక్ చేస్తుంది. లింక్ చేసిన డివైజ్ నుంచి లాక్ చేసిన చాట్‌ల జాబితాను యాక్సెస్ చేయొచ్చు. ఇందుకోసం, వినియోగదారులు సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ పబ్లిక్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తుందని నివేదించింది.

WhatsApp chats linked devices

కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్ :
అంతేకాకుండా, వాట్సాప్ ఇటీవల చాట్‌ల కోసం కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను చేర్చింది. ప్రైవసీ పరంగా ప్రధాన అప్‌డేట్స్‌లో ఇదొకటి. వాట్సాప్‌లో వినియోగదారులు తమ సూపర్ పర్సనల్ చాట్‌లకు లాక్‌ని యాడ్ అవకాశం ఇప్పటికే ఉంది. అయితే, ఇందులో లొసుగు ఉంది. యూజర్లు తమ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే వాట్సాప్ ప్రైవేట్ చాట్‌ల కోసం అదే ఫింగర్ ఫ్రింట్ పాస్‌వర్డ్‌ను ఇవ్వడానికి అనుమతించింది. ప్రాథమికంగా ఎవరైనా మీ ఫోన్‌లో వారి ఫింగర్ ఫ్రింట్ ఎంటర్ చేసుకుంటే.. వాట్సాప్ చాట్‌లను కూడా చెక్ చేయొచ్చు.

కొత్త అప్‌డేట్‌ ప్రకారం.. వినియోగదారులందరికీ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను రిలీజ్ చేయనుంది. వాట్సాప్ ఇప్పుడు, మీ సీక్రెట్ పాస్‌కోడ్‌తో మీ చాట్‌లను భద్రపరచడానికి అనుమతినిస్తుంది. ఎమోజీలతో ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఆసక్తికరంగా, మీరు సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను టైప్ చేయడం ద్వారా లాక్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేయడానికి సెట్టింగ్‌లను కూడా సెట్ చేయవచ్చు.

Read Also : Amazon Mega Electronics Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్.. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్..!

ట్రెండింగ్ వార్తలు