ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఫేస్ బుక్ సొంత కంపెనీ ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా వాట్సాప్ Pin to Top అనే కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్, iOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్ ఓపెన్ చేయగానే యూజర్లకు మంచి మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం Pin to Top ఫీచర్ రిలీజ్ చేసింది. సాధారణంగా వాట్సాప్ లో గ్రూపు సభ్యులతోనూ, పర్సనల్ చాటింగ్ చేస్తుంటారు.
Chat boxలోని ఏదైనా కాంటాక్టుతో చాటింగ్ చేయగానే Old చాటింగ్ అంతా కిందికి వెళ్లిపోతుంది. ప్రతిసారి ముఖ్యమైన చాటింగ్ కాంటాక్టును సెర్చ్ చేయాలంటే కాస్తా చిరాకుగా అనిపిస్తుంది. కింది వరకు Scroll చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఈ Pin to Top ఫీచర్ సాయంతో నచ్చిన వాట్సాప్ చాటింగ్ కాంటాక్టును గ్రూపు కావొచ్చు లేదా పర్సనల్ చాటింగ్ కావొచ్చు ఏదైనాసరే ఈజీగా టాప్ లోకి వచ్చేస్తుంది.
ఎన్ని New Chats చాటింగ్స్ చేసినా అదిపైనే కనిపిస్తుంది. ఫేస్ బుక్ ఏదైనా పోస్టు పెట్టినప్పుడు ఇలా Pin to Top చేస్తుంటాం. ఫేస్ బుక్ మాదిరిగానే Whatsapp లో కూడా అదే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈజీగా ఈ ఫీచర్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందో ఈ కింది విధంగా ఫాలో అవ్వండి చాలు…
Pin Chats ఎలా చేయాలంటే? :
* ( ఆండ్రాయిడ్ లేదా iOS) Devices నుంచి Whatsapp ఓపెన్ చేయండి.
* Chat Windowలో ఏదైనా కాంటాక్ట్ లేదా గ్రూపు Nameపై Long Press చేయండి.
* మీకు నచ్చిన Contact లేదా Group ఐకాన్ వెంటనే హైలెట్ అవుతుంది.
* వాట్సాప్ Top barపై Pin ఐకాన్ కనిపిస్తుంది చూడండి.
* మీ చేతివేలితో Long Press చేసిన కాంటాక్ట్ దగ్గర (Tick mark) కూడా కనిపిస్తుంది.
* ఇలా మొత్తంగా 3 కాంటాక్టులకు మాత్రమే Limit ఉంది.
* ఇందులో ఏదైనా Group లేదా ఇతర Individual కాంటాక్టు కావొచ్చు.
* Tick Mark హైలెట్ కాగానే Top barలో కనిపించే Pin Icon పై Tap చేయండి.
* మీరు Pin చేసిన మూడు చాట్ కాంటాక్టులు Tap barలో కనిపిస్తాయి.
* Pin చేయని చాటింగ్ కూడా Unread ఆప్షన్ లో కనిపిస్తాయి.
* Unread, Pin chat, New Chat ఇలా మూడు ఆష్లను కనిపిస్తాయి.
* ఒకవేళ UnPin చేయాలంటే.. Pin చేసిన Chatపైనే Long Press చేస్తే చాలు..
* ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే.. మీ వాట్సాప్ చాటింగ్ లో ముఖ్యమైన చాట్ లను Pin Top చేయండి..