Whatsapp _ How to use same WhatsApp account on iPhone and Android at the same time
Whatsapp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మల్టీ డివైజ్ సపోర్టు ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ మల్టీ డివైజ్ ఫీచర్ Android, iOS రెండింటికీ అందుబాటులోకి వచ్చింది. మల్టీ డివైజ్‌ల్లో సింగిల్ వాట్సాప్ అకౌంట్‌ను లింక్ చేసుకోవచ్చు. అయితే, వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్‌ను మల్టీ ఫోన్‌లకు ఒకే సమయంలో లింక్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఇప్పటివరకు, వాట్సాప్ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లతో మొబైల్ ఫోన్‌ను లింక్ చేసేందుకు మాత్రమే అనుమతించింది. అయితే, లేటెస్ట్ అప్‌డేట్‌తో అదంతా మారనుంది. గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు తమ డివైజ్‌లలో సజావుగా మెసేజ్‌లను పంపుకునే అవకాశాన్ని కల్పించింది.
ఇప్పుడు, అదే స్థాయిలో ప్రైవసీ, సెక్యూరిటీని కొనసాగిస్తూనే.. మల్టీ డివైజ్‌లకు లింక్ చేసుకునేందుకు అనుమతినిస్తోంది. మీ వాట్సాప్ అకౌంట్‌ను వెబ్ బ్రౌజర్‌లు, టాబ్లెట్‌లు, డెస్క్‌టాప్‌లతో ఎలా లింక్ చేస్తారో అలాగే గరిష్టంగా 4 డివైజ్‌లతో సింకరైజ్ చేసుకోవచ్చు.
మీ వాట్సాప్ అకౌంట్‌ను వివిధ డివైజ్‌లకు ఎలా కనెక్ట్ చేస్తారో అదే విధంగా లింక్ చేసే ప్రాసెస్ ఉంటుంది. మీకు రెండు ఆండ్రాయిడ్ ఫోన్‌లు లేదా ఐఫోన్‌లు లేదా ఒక్కొక్కటి ఉంటే.. మీరు మీ వాట్సాప్ అకౌంట్‌ను ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండింటిలో ఒకేసారి ఉపయోగించవచ్చు. మల్టీ అకౌంట్లకు వాట్సాప్ ఎలా లింక్ చేయాలో ఈ కింది విధంగా ప్రయత్నించండి.
మల్టీ ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఎలా ఉపయోగించాలంటే? :
* మీ ఫోన్‌లో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసి మెయిన్ పేజీకి వెళ్లండి.
* సెట్టింగ్‌ల సెక్షన్ Tap చేయండి. లింక్ చేసిన డివైజ్‌లను ఎంచుకోండి.
* ఈ ఫీచర్ ప్రారంభించడానికి డివైజ్ లింక్‌పై Tap చేయండి.
* ఆ తర్వాత స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
మీరు ఒక యూనిక్ కోడ్‌ని పొందాలంటే.. వాట్సాప్ వెబ్ (Whatsapp Web)లో మీ ఫోన్ నంబర్‌ను రిజిస్టర్ చేయవచ్చు, QR కోడ్‌ని స్కాన్ చేయకుండా, డివైజ్ లింక్‌ను ఎనేబుల్ చేసేందుకు మీ ఫోన్‌లో ఉపయోగించవచ్చు. QR కోడ్ స్కానింగ్ కోసం ఈ కింది విధంగా ప్రయత్నించండి.
* మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* More Options > Linked Devices ఆప్షన్‌పై నొక్కండి.
* Device Link ఆప్షన్‌పై నొక్కండి.
* మీ ప్రైమరీ ఫోన్‌ని UnLock చేయండి.
Whatsapp : How to use same WhatsApp account on iPhone and Android at the same time
Note : మీ డివైజ్‌లో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటే, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆన్ చేయకపోతే.. మీ ఫోన్‌ని Unlock చేయడానికి మీరు ఉపయోగించే పిన్ (PIN)ను ఎంటర్ చేయమని ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది.
* మీరు QR కోడ్‌ని లింక్ చేసి, స్కాన్ చేసే డివైజ్ స్క్రీన్‌పై మీ ప్రైమరీ ఫోన్‌ని పాయింట్ చేయండి.
ప్రపంచవ్యాప్తంగా కొత్త మల్టీ-డివైస్ షేరింగ్ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఈ అప్‌డేట్‌తో, ప్రతి లింక్ చేసిన ఫోన్ స్వతంత్రంగా వాట్సాప్‌కి కనెక్ట్ అవుతుందని తెలిపింది. అన్ని పర్సనల్ మెసేజ్‌లు, మీడియా, కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ తెలిపింది.
ప్రైమరీ డివైజ్ ఎక్కువ కాలం ఇన్ యాక్టివ్ (Inactive)గా ఉంటే, వాట్సాప్ అన్ని ఇతర లింకైన డివైజ్‌ల నుంచి యూజర్‌ను ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ చేస్తుంది. అప్‌డేట్ రాబోయే వారాల్లో యూజర్ల అందరికి అందుబాటులోకి రానుంది. మల్టీ డివైజ్ లింకింగ్ ఫీచర్‌ను పొందాలంటే వాట్సాప్ యూజర్లు తమ డివైజ్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.