WhatsApp Message Drafts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మెసేజ్ డ్రాఫ్ట్‌లో కూడా పెట్టుకోవచ్చు!
WhatsApp Message Drafts : వాట్సాప్ మెసేజ్ మళ్లీ ఎడిట్ చేసి అవసరమైనప్పుడు పంపుకునేందుకు సులభంగా ఉంటుంది. కొత్త అప్‌డేట్‌తో ఏదైనా మెసేజ్ ఆటోమేటిక్‌గా “డ్రాఫ్ట్” లేబుల్ అవుతుంది.

WhatsApp launches new Message Drafts feature
WhatsApp Message Drafts : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. అదే.. వాట్సాప్ మెసేజ్ డ్రాఫ్ట్స్ ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికి అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ అసంపూర్తి మెసేజ్‌లను సులభంగా డ్రాఫ్ట్ చేయొచ్చు. ఏదైనా మెసేజ్ పూర్తిగా టైప్ చేయకుండా ఉంటే.. నేరుగా డ్రాఫ్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. ఆపై ఈ ఫీచర్ సాయంతో ఆయా మెసేజ్‌లు సేవ్ అవుతాయి.
వాట్సాప్ మెసేజ్ మళ్లీ ఎడిట్ చేసి అవసరమైనప్పుడు పంపుకునేందుకు సులభంగా ఉంటుంది. కొత్త అప్‌డేట్‌తో ఏదైనా మెసేజ్ ఆటోమేటిక్‌గా “డ్రాఫ్ట్” లేబుల్ అవుతుంది. చాట్ లిస్ట్ ఎగువన కనిపిస్తుంది. వినియోగదారులు మెసేజ్ ఎక్కడ ఆపివేశారో అక్కడ త్వరగా ఎంచుకోవచ్చు. వాట్సాప్ సాధారణ సమస్యను పరిష్కరించేందుకు మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సగం టైప్ చేసిన మెసేజ్‌లను ఈజీగా ట్రాక్ చేయొచ్చు. వాట్సాప్ యూజర్లకు ఒకేసారి మల్టీ చాట్‌లను నిర్వహించడం అసాధారణం కాదు. కొన్నిసార్లు మెసేజ్‌లు అనుకోకుండా మధ్యలో వదిలివేస్తారు.
డ్రాఫ్ట్ ఫీచర్‌తో వినియోగదారులు ఇకపై చాట్‌ల ద్వారా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. డ్రాఫ్ట్ ఐకాన్ కోసం సెర్చ్ చేయొచ్చు. మెసేజ్ డ్రాఫ్ట్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ వాట్సాప్ యాప్‌ని మాత్రమే అప్‌డేట్ చేస్తే ఫీచర్‌ని పొందవచ్చు. వాట్సాప్ యాక్టివిటీని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేయొచ్చు. అసంపూర్తిగా ఉన్న మెసేజ్‌లను సులభంగా గుర్తించవచ్చు. వాట్సాప్ మరింత సౌకర్యవంతమైన టూల్‌గా మార్చాలని కంపెనీ భావిస్తోంది.