Mother’s Day 2021 : వాట్సాప్ మదర్స్ డే యానిమేటెడ్ స్టిక్కర్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

ప్రతి ఏడాది మే 9న ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మదర్స్ డే సందర్భంగా కొత్త స్టిక్కర్ ప్యాక్ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది కూడా వాట్సాప్ మదర్స్ డే యానిమేటెడ్ స్టిక్కర్లను రిలీజ్ చేసింది.

Whatsapp Launches Special Mother's Day Animated Stickers How To Download And Send

Mother’s Day 2021 Mama Love animated Sticker Pack : ప్రతి ఏడాది మే 9న ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మదర్స్ డే సందర్భంగా కొత్త స్టిక్కర్ ప్యాక్ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది Mother’s Day 2021 కూడా వాట్సాప్ మదర్స్ డే యానిమేటెడ్ స్టిక్కర్లను రిలీజ్ చేసింది. ఈ కొత్త యానిమిటేడ్ స్టిక్కర్లు ప్రపంచంలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికి అందుబాటులోకి వచ్చేశాయి. వాట్సాప్ లో స్టిక్కర్ ప్యాక్ ‘Mama Love’ పేరుతో అందుబాటులో ఉన్నాయి. ఈ మామ లవ్ స్టిక్కర్ ప్యాకులో మొత్తం 11 స్టిక్కర్లు ఉంటాయి. అన్నీ యానిమేటెడ్ స్టిక్కర్లే.. కొత్త మదర్స్ డే 2021 స్టిక్కర్ ప్యాక్ ను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్లందరికి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటివరకూ మీ వాట్సాప్ లో మదర్స్ డే స్టిక్కర్లు అప్ డేట్ కాలేదా? అయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో మీ వాట్సాప్ అప్ డేట్ చేసుకోండి.. మదర్స్ డే స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. వాట్సాప్ అప్లికేషన్ లో స్టిక్కర్ లైబ్రరీ ఉంటుంది. చాట్ బాక్సు ఓపెన్ చేయగానే.. స్టిక్కర్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. టైపింగ్ స్పేస్ దగ్గర Mama Love Sticker Pack పై క్లిక్ చేయండి..

ఈ స్టిక్కర్లను మదర్స్ డే సందర్భంగా మీ మదర్ కు పంపించి గ్రీటింగ్ తెలియజేయొచ్చు… ఒకవేళ వాట్సాప్ రిలీజ్ చేసిన మదర్స్ డే స్టిక్కర్లు మీకు నచ్చకపోతే.. థర్డ్ పార్టీ ప్లాట్ ఫాంల నుంచి కూడా సంబంధిత స్టిక్కర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ ఆప్షన్ పనిచేస్తుంది.. గూగుల్ ప్లే స్టోర్ లో మదర్స్ డే స్టిక్కర్లకు సంబంధించి వివిధ థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.