WhatsApp Feature : వాట్సాప్‌ కొత్త ఫీచర్ కేక.. ఇక నో చాట్ ఓపెన్.. ఆన్‌లైన్‌లో ఎవరూ ఉన్నారో ఒకేచోట చూడొచ్చు.. ఎలాగంటే?

WhatsApp Feature : ప్రస్తుతం వాట్సాప్‌ కాంటాక్ట్‌లలో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో చూసేందుకు లిస్టు కనిపించనుంది. ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp Feature ( Image Credit to Original Source )

  • వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్
  • చాట్ ఆన్ లైన్ స్టేటస్ కోసం క్రేజీ ఫీచర్ టెస్టింగ్
  • ఒకేచోట అందరి కాంటాక్టుల ఆన్ లైన్ లిస్టు చూడొచ్చు

WhatsApp Feature : వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్ వస్తోంది. ఇకపై వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో తెలుసుకోవచ్చు. మీ కాంటాక్టులో ఉన్న ప్రతిఒక్క వాట్సాప్ యూజర్ ఆన్ లైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అతి త్వరలో ఈ క్రేజీ ఫీచర్ రాబోతుంది.

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఉన్న కాంటాక్ట్‌ల లిస్టును కనిపించే స్పెషల్ సెక్షన్ పరీక్షిస్తోంది. కచ్చితంగా యూజర్ల టైమ్ సేవ్ అవుతుంది. ఎందుకంటే.. మీరు ఒక్కో చాట్‌ను ఓపెన్ చేయకుండా అన్ని ఒకే చోట చూడొచ్చు.

ఒకేచోట ఆన్‌లైన్ లిస్ట్ :
ప్రస్తుతం కాంటాక్ట్ ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఒకే ఒక మార్గం వారితో చాట్‌ చేయడమే. ఇంతకీ ఎవరు అందుబాటులో ఉన్నారో తెలియాలంటే చాట్ చేస్తేనే గానీ తెలియదు. ఇందుకోసం ఒక్కో చాట్ ఓపెన్ చేసి మరి చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో తెలియాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇకపై ఇలాంటి సమస్య ఉండదు అనమాట.

“ఆండ్రాయిడ్ 2.24.25.30 అప్‌డేట్ వాట్సాప్ బీటా గ్రూపులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యాక్టివిటీ ఇండికేటర్‌ మరింత స్పష్టంగా కనిపించేలా వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఈసారి, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్న కాంటాక్ట్‌ల పేర్లను కూడా కనిపించేలా చేయాలని యోచిస్తోందని వాట్సాప్‌ను ట్రాక్ వెబ్‌సైట్ నివేదించింది.

బీటా వెర్షన్ రిలీజ్ :
“గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ 2.26.13.3కు లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్ రిలీజ్ అయింది. వినియోగదారులు తమ కాంటాక్ట్‌లలో ప్రస్తుతం ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో లిస్టును చూసేందుకు ఈ ఫీచర్‌ రానుంది. ప్రస్తుతం వాట్సాప్ టెస్టింగ్ చేస్తోందని నివేదిక తెలిపింది.

Read Also : Motorola Edge 50 Fusion 5G : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా 5G ఫోన్.. కర్వడ్ డిస్‌ప్లే కిర్రాక్.. ఏకంగా రూ. 7వేలు డిస్కౌంట్..!

షేర్ చేసిన స్క్రీన్‌షాట్ల ప్రకారం.. వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఈ సెక్షన్ అందించే అవకాశం ఉంది. ఒక స్పెషల్ హబ్‌ను యాక్సెస్ చేయొచ్చు. యూజర్లు ఈజీగా తమ కాంటాక్ట్‌లతో చాట్స్ చేయొచ్చు.

ఇంతకీ ఈ ఫీచర్ వాట్సాప్‌లో ఎక్కడ రానుందో తెలియదు. రాబోయే ఈ ఫీచర్ మీ కాంటాక్ట్స్ సెట్ చేసిన ప్రైవసీ సెట్టింగ్స్‌ మాదిరిగా ఉండొచ్చు. ఎవరైనా ‘Last Seen’ను డిసేబుల్ చేసి ఉంటే.. ఆ సమాచారం ఆధారంగా లిస్టులో కనిపించరు.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉంటేనే కనిపిస్తారు. అయితే, కాంటాక్ట్ ఆన్‌లైన్ హైడ్ చేస్తే స్టేటస్‌ను లిస్టులో అస్సలు కనిపించరు. ప్రైవసీపరంగా ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. అలాగే, కాంటాక్ట్‌లు యాక్టివ్‌గా ఉన్నప్పుడు చాట్స్ చేసేందుకు ఈ ఫీచర్ ఈజీగా ఉంటుందని WABetaInfo తెలిపింది.

ప్రస్తుతం ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో చూడాలంటే చాట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇకపై ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎవరు ఆన్‌లైన్‌లో చాట్ ఓపెన్ చేయకుండానే చెక్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ డెవలప్ స్టేజీలో ఉంది. అతి త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది.