WhatsApp Username : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫోన్ నెంబర్ ఇలా హైడ్ చేయొచ్చు.. స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టొచ్చు..!

WhatsApp Username : వాట్సాప్‌లో త్వరలో మీ ఫోన్ నంబర్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ స్థానంలో యూజర్ నేమ్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. స్పామ్ కాల్స్‌కు రాకుండా నివారించవచ్చు.

WhatsApp Username to Hide Phone Number : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను హైడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్ ప్లేసులో యూజర్ నేమ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ ఈ కొత్త అప్‌డేట్‌పై పని చేస్తోంది. యూజర్ నేమ్ మీకు గుర్తుండిపోయేలా సెట్ చేసుకోవాలి. రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను ఎవరికి తెలియకుండా ఇతరుల కాంటాక్టులను యాడ్ చేసేందుకు అనుమతించవచ్చు. వాట్సాప్ అప్‌డేట్‌ల ట్రాకర్, (WABetaInfo) ప్రకారం.. ఈ వాట్సాప్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. యూజర్ నేమ్ ద్వారా చేసే చాట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుందని వాట్సాప్ ట్రాకర్ పేర్కొంది.

ప్రస్తుతం, వాట్సాప్ బీటా యూజర్లకు కూడా ఈ ఫీచర్ యాక్సస్ లేదు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో సిగ్నల్‌ (Signal)తో సహా కొన్ని మెసేజింగ్ యాప్‌లు, యూజర్లకు తమ ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయకుండా లాగిన్ చేసేందుకు అనుమతి ఇస్తున్నాయి. ఇతరులతో చాటింగ్ చేసే సమయంలో స్పెషల్ యూజర్ నేమ్ ఎంచుకోవడానికి అనుమతిస్తాయి. వాట్సాప్ మొబైల్ నంబర్ ఆప్షన్‌తో కాకుండా లాగిన్ కావచ్చు. వాట్సాప్‌లోని యూజర్‌నేమ్ ఫీచర్ ఎలా పని చేస్తుందనే స్క్రీన్‌షాట్ రిపోర్ట్‌లో ఉంది. సెట్టింగ్‌లలోని ప్రొఫైల్ సెక్షన్‌లో ఫీచర్ ఆప్షన్ చూడవచ్చు.

WhatsApp Username may soon let you choose username to hide phone number

Read Also : WhatsApp Trick : బ్లాక్ కలర్, ఫ్యాన్సీ ఫాంట్‌లతో వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!

కొత్త యూజర్‌నేమ్ ఆప్షన్‌తో వాట్సాప్ స్పామ్ కాల్స్ తగ్గుతాయా? :
ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో చాలా మంది యూజర్లు స్పామ్ కాల్‌లు, మెసేజ్‌లపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఫిషింగ్ వంటి ఫ్రాడ్ లింక్స్‌ను స్కామర్లు పంపుతున్నారు. భారత్‌లోని యూజర్లకు అంతర్జాతీయ నంబర్‌ల నుంచి స్పామ్ కాల్స్ స్వీకరించినట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. మొబైల్ నంబర్‌‌కు బదులుగా యూజర్ నేమ్ ఎంచుకోవడం వల్ల సెక్యూరిటీ లేయర్ యాడ్ చేయొచ్చు. హ్యాకర్లు, స్కామర్లు ఎల్లప్పుడూ ఇతరులను మోసగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లాగిన్ చేసేందుకు వినియోగదారు పేర్లనే వినియోగిస్తున్నాయి. అయితే చాలా మంది ఈ యాప్‌లలో ఫిషింగ్ మెసేజ్‌లు, ఫేక్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.

వాట్సాప్ లేదా మాతృ సంస్థ మెటా ఇంకా కొత్త ఫీచర్‌ ఏంటి అనేది ధృవీకరించలేదు. వాట్సాప్ భారతీయ యూజర్ల కోసం ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. గత నెలలో, ప్లాట్‌ఫారమ్ మల్టీ డివైజ్ కనెక్టివిటీ ఆప్షన్ అందించింది. ఇన్‌బిల్ట్ లింక్ ఆప్షన్ ద్వారా మల్టీ ఫోన్‌లలో వాట్సాప్ వినియోగించుకోవచ్చు. ఇతరుల నుంచి ఎంచుకున్న చాట్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు వాట్సాప్ లాక్ చాట్ ఫీచర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ వారం ప్రారంభంలో, టెక్స్ట్‌ని పంపిన 15 నిమిషాలలోపు మెసేజ్ ఎడిట్ చేసేందుకు యూజర్లను అనుమతించే ఎడిట్ మెసేజ్ ఆప్షన్ కూడా కంపెనీ ప్రకటించింది.

Read Also : Nothing Phone 2 Launch : నథింగ్ ఫోన్ (2) వచ్చేస్తోంది.. జూలైలోనే అధికారిక లాంచ్.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు