Whatsapp New Channel _ WhatsApp working on new Channels feature _ What is it and how it will benefit users
Whatsapp New Channel : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ ఛానల్స్ (Channels) అనే కొత్త ఫీచర్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వర్క్ చేస్తోందని సమాచారం. ఈ కొత్త ఫీచర్ ద్వారా త్వరగా వార్తలను ఇతరులకు షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. అంటే.. వన్ టూ ఆల్ టూల్ అనమాట.. (WaBetaInfo) నివేదిక ప్రకారం.. సోషల్ మెసేజింగ్ యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌తో కొత్త ఫీచర్‌ను అందించనుంది.
ఇంతకుముందు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసమే రానుందని రుమర్లు వచ్చాయి. అయితే, iOS 23.8.0.75 లేటెస్ట్ (WhatsApp Beta)కు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ iPhone యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్ ‘ఛానల్’ అందుబాటులోకి రానుంది. రాబోయే ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కంపెనీ షేర్ చేసింది. ప్రస్తుత వాట్సాప్ స్టేటస్ ట్యాబ్ ‘Updates’ ను ఛానల్‌లు (Channels)గా మార్చాలని కంపెనీ యోచిస్తోందని నివేదిక పేర్కొంది. వాట్సాప్‌లోని సెక్షన్‌లో WhatsApp ఛానల్‌లు లిస్టును పొందవచ్చు.
వాట్సాప్ ఛానల్ అనేది ఛానల్‌లో చేరిన ఫోన్ నంబర్‌లు, యూజర్ డేటా ఎల్లప్పుడూ హైడ్ చేసే ప్రైవేట్ టూల్.. అయితే, వ్యక్తిగత చాట్‌ల మాదిరిగా కాకుండా, ఛానల్‌లో పొందిన మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ కావని గమనించాలి. ఎందుకంటే.. ఒకరి నుంచి అనేకమంది అనే కాన్సెప్ట్ ఛానల్‌లకు మాత్రమే పనిచేస్తుంది.
Whatsapp New Channel _ WhatsApp working on new Channels feature
తద్వారా ఈ చానల్ ద్వారా పంపే సమాచారం ఓపెన్‌గా ఉంటుంది. అయితే, ప్రైవేట్ మెసేజింగ్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది WaBetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ యూజర్లు ఏ ఛానల్‌లకు సభ్యత్వాన్ని పొందాలి అనేదానిపై కంట్రోల్ కలిగి ఉంటారు. యూజర్లు ఎవరిని కాంటాక్ట్‌లుగా యాడ్ చేశారు అనేది ఇతరులు చూడలేరు.
అంతేకాదు.. వ్యక్తిగత వాట్సాప్ యూజర్లు ఎంచుకోని కంటెంట్‌ను వారికి అందించదు. వాట్సాప్ యూజర్ల ప్రమేయం లేకుండా ఆటో సబ్ స్ర్కిప్షన్ అందించదు. ఇక, అల్గారిథమ్, సోషల్ అకౌంట్ల ద్వారా కంటెంట్‌ను ఛానల్‌లకు సిఫార్సులు చేయదు. వాట్సాప్ ఛానల్‌లు నిర్దిష్ట వాట్సాప్ ఛానల్‌ని వాట్సాప్‌లో యూజర్ నేమ్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లకు తమకు నచ్చిన అప్‌డేట్స్ ఈజీగా పొందవచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ ఛానల్ ఫీచర్ డెవలప్ స్టేజీలో ఉంది. రాబోయే అప్‌డేట్‌తో ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది.
Read Also : WhatsApp New Features : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. రాబోయే సరికొత్త ఫీచర్లు ఏంటో తెలుసా?