WhatsApp to get a new design, more features incoming: All details
WhatsApp New Features : ప్రముఖ మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp Users) యూజర్లకు అలర్ట్.. వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS, డెస్క్‌టాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవలే స్టేటస్ అప్‌డేట్‌ల కోసం ఆటోమేటిక్ ఫేస్‌బుక్ షేరింగ్ గ్లోబల్ ఫీచర్ ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్ కోసం.. వాట్సాప్ మెసేజింగ్, కనెక్టివిటీని మెరుగుపరచేందుకు యానిమేటెడ్ ఎమోజీలపై పనిచేస్తోంది.Wabetainfo ప్రకారం.. యూజర్ మెసేజ్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచేందుకు ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ యానిమేటెడ్ ఎమోజీల ఫీచర్‌పై పని చేస్తోంది.
వాట్సాప్ లోటీ అనే లైబ్రరీని ఉపయోగించి యానిమేటెడ్ ఎమోజీలను డెవలప్ చేస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ డిజైనర్లను సులభంగా యానిమేషన్‌లను రూపొందించడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉంది. కానీ, భవిష్యత్తులో అప్‌డేట్‌లతో వాట్సాప్ డెస్క్‌టాప్, మొబైల్ యాప్‌ల బీటా బిల్డ్‌లలో రానుందని భావిస్తున్నారు. అయితే, ఒకసారి రిలీజ్ అయిన తర్వాత, మెసేజింగ్‌ను మరింత వ్యక్తిగతంగా అందించేందుకు వాట్సాప్ స్టిక్కర్‌ల వంటి యానిమేటెడ్ ఎమోజీలను పంపేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
Read Also : WhatsApp Animated Emoji : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. లేటెస్ట్ బీటాలో యానిమేటెడ్ ఎమోజీ వస్తోంది..!
ముఖ్యంగా, వాట్సాప్ యానిమేషన్‌లను డిఫాల్ట్‌గా షార్ట్ సైజులో అందించనుంది. ఫొటో క్వాలిటీ కోల్పోకుండా రేషియోలను మార్చడానికి యూజర్లకు అనుమతిస్తుంది. యానిమేటెడ్ ఎమోజీలతో పాటు, వాట్సాప్ ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం రీడిజైన్ చేసిన కీబోర్డ్‌ను కూడా రిలీజ్ చేయడానికి యోచిస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజీలో ఉంది. ఈ యాప్ ఫ్యూచర్ అప్‌డేట్ త్వరలో అందుబాటులోకి రానుంది. Google Play Storeలో అందుబాటులో ఉన్న (Android 2.23.9.2) అప్‌డేట్ కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటాకు ధన్యవాదాలు.. వాట్సాప్ కూడా యాప్ కీబోర్డ్‌ను ట్వీకింగ్ చేయడంలో పనిచేస్తోందని కనుగొన్నామని WABetaInfo పేర్కొంది.
WhatsApp New Features : WhatsApp to get a new design, more features incoming
వాట్సాప్ కీబోర్డ్‌ను రీడిజైన్ చేస్తోందని, సెలక్షన్ బార్‌ను దిగువ నుంచి పైకి మార్చిందని, కేటగిరీల బార్‌ను తొలగించనుందని నివేదిక సూచిస్తుంది. ఈ కొత్త డిజైన్ మార్పు వివిధ కేటగిరీల ఎమోజీలను యాక్సెస్ చేసేందుకు యూజర్లకు అనుమతించే బార్‌ను కూడా తొలగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కేటగిరీ బార్ ప్రస్తుతం యూజర్లను వివిధ కేటగిరీల నుంచి ఎమోజీలను యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ బార్‌ను తొలగించడం వల్ల ఎమోజీలను తరచుగా ఉపయోగించే యూజర్లపై ప్రభావం చూపిస్తుంది.
ఈ మార్పుతో, యూజరలు తమ నిర్దిష్ట ఎమోజీని పంపేందుకు మరింత స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉందని, ఇంకా టెస్టింగ్‌లోనే ఉందని గమనించాలి. ఇంతలో, నివేదికలో పేర్కొన్న లేటెస్ట్ అప్‌డేట్ పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో సపోర్టు అందించనుంది. నివేదిక ప్రకారం.. వాట్సాప్ రాబోయే అప్‌డేట్‌తో 5.0 కన్నా తక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లకు సపోర్టును నిలిపివేసినట్టు కనిపిస్తోంది. పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లకు సపోర్టు ముగిసింది. సెక్యూరిటీ, యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఆపరేటింగ్ సిస్టమ్ మరింత మెరుగుపర్చనుంది.
Read Also : Xiaomi 12 Pro Sale : రూ. 42,999కే షావోమీ 12ప్రో ఫోన్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!