WhatsApp New Scam : వాట్సాప్‌లో కొత్త సైబర్ స్కామ్.. ఏకంగా రూ. 57 కోట్లు కోల్పోయిన యూజర్లు.. ఇలా చేస్తే.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండొచ్చు!

WhatsApp New Scam : ప్రపంచవ్యాప్తంగా సైబర్ మనీ మోసాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు అమాయకులను మభ్యపెట్టి వారి బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.

WhatsApp New Scam : ప్రపంచవ్యాప్తంగా సైబర్ మనీ మోసాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు అమాయకులను మభ్యపెట్టి వారి బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎటీఎం కార్డ్ స్కామ్ (ATM Card Scam), యూపీఐ (UPI scam) స్కామ్ లేదా సిమ్ స్వాప్ (Swim Swap) స్కామ్ కావచ్చు. ఇలా ఏదైనా స్కామ్ ద్వారా మోసగాళ్లు విలువైన నగదును చోరీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌లో కొత్త స్కామ్ ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియా నుంచి ఒక కొత్త కేసు నమోదైంది. ఇక్కడి సైబర్ మోసగాళ్ళు ఇప్పుడు బాధితుల కుటుంబ సభ్యులుగా నటిస్తూ.. వారి మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకున్నారనే నెపంతో డబ్బు పంపమని అడుగుతున్నారు.

ఇటీవల నివేదించిన ఈ స్కామ్‌లో ‘Hi Mum’ అనే స్కామ్ ద్వారా మోసగాళ్ళు WhatsApp టెక్స్ట్‌లో బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు మాదిరిగా నమ్మించి వారు కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. అంతేకాదు.. తమ ఫోన్‌ను పోగొట్టుకున్నామని లేదా పాడైపోయినందంటూ తమకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. మరో కొత్త మొబైల్ నంబర్‌తో వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. బాధితులు వారి టెక్స్ట్‌లను చూసిన తర్వాత వారిని డబ్బు పంపమని అడుగుతారు. ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం.. చాలా మంది ఆస్ట్రేలియన్లు ఈ కొత్త స్కామ్‌కు గురయ్యారు. తద్వారా వాట్సాప్ యూజర్లు 7 మిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ. 57.84 కోట్లు) నష్టపోయారు.

‘Hi Mum’ స్కామ్ అంటే ఏంటి? :
నివేదికల ప్రకారం.. స్కామర్ బాధితులను వాట్సాప్‌లో సంప్రదిస్తారు.. తమ ఫోన్‌ను పోగొట్టుకున్నారని లేదా పాడైపోయిందని కొత్త నంబర్‌ వాడుతున్నామని నమ్మిస్తారు. బాధితులు వారిని నమ్మిన తర్వాత వారి సోషల్ మీడియా ప్రొఫైల్ కోసం ఫోటోలు లేదా ఎవరికైనా అత్యవసరంగా బిల్లు చెల్లించేందుకు లేదా ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు నగదు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ తాత్కాలికంగా నిలిచిపోయిందని, దాంతో తాము కార్డ్‌ల ద్వారా యాక్సెస్ చేయలేమని చెబుతారు. తమకు డబ్బు చాలా అవసరం ఉందని నమ్మబలుకుతారు. అలా వాట్సాప్ యూజర్ల నుంచి కోట్లాది నగదును కాజేశారు.

WhatsApp New Scam _ WhatsApp Users lose over Rs 57 crore to a new scam

Read Also : QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?

ఆస్ట్రేలియన్ కన్స్యూమర్ అండ్ కాంపిటీషన్ కమిషన్ (ACCC) ‘హాయ్ మమ్’ స్కామ్‌లలో గణనీయమైన పెరుగుదలను గుర్తించింది. 1,150 మందికి పైగా స్కామ్‌కు గురయ్యారని నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. వాట్సాప్ యూజర్లు గత కొన్ని నెలల్లో సుమారు 2.6 మిలియన్ డాలర్లు.. అంటే.. దాదాపు రూ. 21 కోట్లు నష్టపోయారు. 2022లోనే కనీసం 11,100 మంది బాధితుల నుంచి 7.2 మిలియన్ డాలర్లు (రూ. 57.84 కోట్లు) దోచుకున్నారు.

55 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీల ద్వారా స్కామ్‌లకు సంబంధించి చాలా కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా ‘Hi Mum’ స్కామ్‌లు గణనీయంగా పెరిగాయని తేలింది. 1,150 మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఈ స్కామ్‌కు గురయ్యారు. మొత్తంగా 2.6 మిలియన్ డాలర్లు నష్టం వాటిల్లిందని ACCC ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొంది. అనుమానాస్పద మెసేజ్‌ల ద్వారా డబ్బును బదిలీ చేసే ముందు ఆయా కాంటాక్ట్ ఎవరిదో కచ్చితంగా ధృవీకరించాలని ఆస్ట్రేలియా అధికారులు కోరారు.

ఈ హాయ్ మమ్ స్కామ్.. ఆస్ట్రేలియాలో నమోదైనప్పటికీ.. భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా భారత్ కూడా సైబర్ మోసాల్లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. ఇటీవల, ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్తను మోసగించి.. అతని అనేక బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారు రూ.50 లక్షలు కాజేశారు. SIM Swap, QR కోడ్ స్కామ్‌లు, ఫిషింగ్ లింక్‌లతో అనేక కేసులు నమోదవుతున్నాయి. ఈ సైబర్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ కిందివిధంగా జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం..

సైబర్ మోసాల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలంటే? :

* మీ OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
* మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ PIN, CVV నంబర్‌ను ఎవరికీ షేర్ చేయొద్దు.
* మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు అయినా ఎవరికీ వెల్లడించవద్దు.
* గుర్తు తెలియని కాంటాక్టు ద్వారా పంపిన లింక్‌లపై ఎప్పుడూ Click చేయవద్దు.
* సురక్షితమైన, అధీకృత వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే ఏదైనా బ్రౌజ్ చేయండి.
* అనుమానాస్పద లాగిన్‌లు, మెసేజ్ గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.
* ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో మీ పేమెంట్ వివరాలను వెబ్‌సైట్‌లలో ఎప్పుడూ Save చేయవద్దు.
* ఎల్లప్పుడూ విశ్వసనీయ, ధృవీకరించిన సైట్‌ల నుంచి షాపింగ్ చేయండి.
* ఎవరైనా మీ బ్యాంక్ వివరాలు, UPI వివరాలు, ఇతర వివరాలను అడిగినప్పుడు వెరిఫైడ్ బిజినెస్ నుంచి మాత్రమే కాల్‌లను స్వీకరించండి.
* ఎవరైనా ఫోన్ చేసి, బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెబితే.. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అడిగితే వారిని ఎప్పుడూ నమ్మవద్దు.
* మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యునిగా నమ్మిస్తూ ఎవరైనా మీతో మాట కలిపితే.. వారి ఐడెంటిటీని ఎల్లప్పుడూ ధృవీకరించండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు