WhatsApp View Once : పాస్‌వర్డ్‌లు, OTPలు పంపుతున్నారా? WhatsAppలో కొత్త సేఫ్టీ ఫీచర్.. మెసేజ్ చదివాక మాయం..!

WhatsApp View Once : వాట్సాప్ కొత్త వ్యూ వన్స్ టెక్స్ట్ మెసేజ్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లను ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ వివరాలేంటో తెలుసుకుందాం..

WhatsApp View Once

  • వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..
  • ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకూ వ్యూ వన్స్ ఆప్షన్
  • మీ సీక్రెట్ మెసేజ్‌లకు కొత్త ప్రొటెక్షన్..

WhatsApp View Once : వాట్సాప్ యూజర్లకు పండగే.. ఇకపై ఇమేజ్ మాత్రమే కాదు.. టెక్ట్స్ మెసేజ్ కూడా అదృశ్య కానుంది. వాట్సాప్ యూజర్లు చాలావరకూ తమ వ్యక్తిగత విషయాల నుంచి ఆఫీస్ వర్క్ వరకు ప్రతిదానికీ ఈ యాప్‌పైనే ఆధారపడుతున్నారు.

అయితే కొన్నిసార్లు పాస్‌వర్డ్‌లు, OTP, బ్యాంకింగ్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు మెసేజ్ చేయాల్సి వస్తుంటుంది. అలాంటి సమయంలో మనం పంపిన సమాచారం అవతలి వ్యక్తి దగ్గర ఎక్కువసేపు ఉండకూడదని అనుకుంటాం.. సరిగ్గా ఇలాంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ సరికొత్త కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది..

ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లకు మాత్రమే ‘View Once’ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా విస్తరించనుంది వాట్సాప్.. ప్రముఖ వాట్సాప్ అప్‌డేట్స్ వెబ్‌సైట్ (WABetaInfo) రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.45.6లో ఈ ఫీచర్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది..

ఎలా పంపించాలంటే? :

ముందుగా మీరు ఎవరికైతే మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేసి టెక్స్ట్ టైప్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ కలర్‌లో ఉండే Send బటన్‌ను కొద్దిసేపు ట్యాప్ చేసి పట్టుకోవాలి. అప్పుడు ‘View Once’ అనే ఆప్షన్ కనిపిస్తే దాన్ని ఎంచుకుని మెసేజ్ పంపించవచ్చు. అయితే, ఈ ఫీచర్ అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు..

Read Also : Samsung Galaxy S27 Pro : శాంసంగ్ గెలాక్సీ S27 ప్రో లీక్స్.. అదిరిపోయే కెమెరా, 5200mAh బ్యాటరీతో కొత్త ఫ్లాగ్‌షిప్!

  • మెసేజ్ పంపబోయే వ్యక్తి చాట్ విండోను ఓపెన్ చేసి ఒక టెక్స్ట్ మెసేజ్ టైప్ చేయండి
  • ‘View One’ అనే ఆప్షన్ ట్యాప్ చేసి పట్టుకోవాలి..
  • ఇంతకీ ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి.
  • ఇప్పుడు Send బటన్‌ను (గ్రీన్ ఏరోప్లేస్ ఐకాన్) ట్యాప్ చేసి పట్టుకోండి.
  • ఈ ఫీచర్‌ మీకు కనిపిస్తే ‘Schedule message’ and ‘View once’ అనే 2 ఆప్షన్లు ఉంటాయి.
  • ‘View once’ని ఎంచుకుని, వ్యూ వన్స్ డిస్క్రప్షన్ షీట్ కనిపిస్తే ‘OK’ ట్యాప్ చేసి మెసేజ్ పంపండి

ఈ ఫీచర్‌లో స్పెషాలిటీ ఇదే :
అవతలి వ్యక్తి మెసేజ్ ఓపెన్ చేసి చదివిన తర్వాత అది మళ్లీ చూసేందుకు వీలుండదు. అంతేకాదు, మెసేజ్‌ను కాపీ చేయడం, ఫార్వర్డ్ చేయడం, సేవ్ చేయడం వంటి ఆప్షన్లను కూడా వాట్సాప్ లిమిట్ చేస్తోంది. యాప్‌లో స్క్రీన్ రికార్డింగ్‌ను కూడా బ్లాక్ చేయనుంది.. మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత అది ‘Opened’ అని కనిపిస్తుంది..

ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. రానున్న వారాల్లో మరింతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే (View Once) ఫీచర్ ఉన్నా, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలను మెసేజ్‌లలో పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి..