WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది.

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. గత మే నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఒక నెలలో 19 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించినట్టు వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ఎక్కువ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ప్రధానంగా ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని నివేదిక తెలిపింది. లేటెస్ట్ నివేదికలో మే 1, 2022 నుంచి మే 31, 2022 మధ్య కాలానికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది.

నెలవారీ నివేదికపై WhatsApp ప్రతినిధి మాట్లాడుతూ.. IT రూల్స్ 2021 ప్రకారం.. 2022 మే నెలలో నివేదికను వెల్లడించాం. ఈ వినియోగదారు-భద్రతా నివేదికలో స్వీకరించిన యూజర్ల ఫిర్యాదుల వివరాలు ఉన్నాయి. WhatsApp తమ ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు సొంత నివారణ చర్యలు చేపట్టింది. నెలవారీ నివేదికలో మే నెలలో వాట్సాప్ 1.9 మిలియన్లకు పైగా అకౌంట్లను నిషేధించింది. “వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో అగ్రగామి. ఏళ్లుగా తమ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల డేటా సురక్షితంగా ఉంచడానికి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా శాస్త్రవేత్తలు, నిపుణులతో ఈ చర్యలను చేపడుతున్నామని ప్రతినిధి తెలిపారు.

Whatsapp Says It Banned Over 19 Lakh Accounts In May

WhatsApp అకౌంట్లను ఎందుకు నిషేధించిందంటే? :
కంపెనీ విధానాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సాధారణంగా అకౌంట్లను నిషేధిస్తామని WhatsApp గతంలో స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ధృవీకరించని మెసేజ్‌లను మల్టీ కాంటాక్టులకు ఫార్వార్డ్ చేయడం, మరిన్నింటిలో యూజర్ షేర్ చేసినట్టు ధ్రువీకరిస్తే.. WhatsApp ఆయా అకౌంట్లను నిషేధిస్తుంది. ఔట్ లింక్‌లను ధృవీకరించడం, మెసేజ్ అనేక ప్లాట్‌ఫారమ్ చర్యలను చేపట్టింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అనేక సార్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లపై కూడా నిఘా పెడుతోంది. చాలా సందర్భాలలో నకిలీవని తేలింది.

హాని తలపెట్టేలా ఉన్న ఏదైనా సమాచారాన్ని వెంటనే గుర్తించి మొదట్లోనే ఆపడం చాలా మంచిదని వాట్సాప్ విశ్వసిస్తోంది. ఈ విధానం మూడు దశల్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ పంపేటప్పుడు, నెగటివ్ సంభాషణలను పంపడం వంటి అంశాలను వాట్సాప్ పరిగణనలోకి తీసుకుంటుంది. వాటిని పరిశీలించి బ్లాక్ చేయడం జరుగుతుందని కంపెనీ నివేదికలో పేర్కొంది. యాప్‌లో యూజర్లు తమ నిషేధిత అకౌంట్లను విత్ డ్రా చేసుకునే సామర్థ్యాన్ని అందించడంలో WhatsApp పని చేస్తోందని కొన్ని లీక్‌లు సూచిస్తున్నాయి. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also : WhatsApp Ban : 14.26 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం..!

ట్రెండింగ్ వార్తలు