WhatsApp Big Update : వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై హై-క్వాలిటీ ఫొటోలను ఈజీగా షేర్ చేయొచ్చు..!

WhatsApp Big Update : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో కొన్ని మల్టీ ఫీచర్లపై పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. వాట్సాప్ తమ యూజర్ల కోసం త్వరలో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను షేర్ చేసేందుకు కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.

WhatsApp Big Update : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో కొన్ని మల్టీ ఫీచర్లపై పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. వాట్సాప్ తమ యూజర్ల కోసం త్వరలో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను షేర్ చేసేందుకు కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.

ఈ ఏడాదిలో Whatsapp అతిపెద్ద అప్‌డేట్‌లలో ఒకటిగా రానుంది. వాట్సాప్ యూజర్లకు చాలా అవసరమైన ఫీచర్. కాంటాక్ట్‌లతో హై-క్వాలిటీ ఫోటోలను షేర్ చేయడంలో ఈ ఫీచర్ సాయపడుతుంది. WaBetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. WhatsApp ఫొటో క్వాలిటీ ఆప్షన్ యాడ్ చేస్తుంది. మీరు మీ కాంటాక్టులతో మీడియాను షేర్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఫొటో క్వాలిటీ కోసం ఐకాన్ డ్రాయింగ్, ఇతర టూల్స్‌తో పాటు స్క్రీన్ పైభాగంలో ఉంటుంది.

వాట్సాప్ తమ ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. తమ కాంటాక్టులతో మీడియాను షేర్ చేయాలనుకున్న ప్రతిసారీ క్వాలిటీ సెట్టింగ్‌ను మార్చవలసి ఉంటుంది. రాబోయే వారాలు లేదా నెలల్లో వాట్సాప్ తమ ఫీచర్లపై మరింత క్లారిటీ ఇవ్వనుంది. కానీ, ఈ ఫీచర్‌ని యాడ్ చేయడంతో మీ డివైజ్ గతంలో కన్నా ఎక్కువ డేటాను ఉపయోగిస్తుందని చెప్పవచ్చు.

WhatsApp set to get big update, will let you share photos in original quality

Read Also : WhatsApp Voice Messages : వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను ఇకపై స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ఫొటోలను డౌన్‌లోడ్ చేసేందుకు Wi-Fiని ఉపయోగించవచ్చు. ఎందుకంటే మీరు ప్రస్తుతం పంపుతున్న ఫొటోలతో పోలిస్తే ఫొటోల రిజల్యూషన్, సైజు చాలా ఎక్కువగా ఉంటుంది. వాట్సాప్ ప్రస్తుతం మీరు పంపే ఫొటోలు లేదా వీడియోల క్వాలిటీ రెండు కారణాల వల్ల కంప్రెస్ చేస్తుంది. లో-క్వాలిటీ కంటెంట్ తక్కువ డేటాతో చాలా త్వరగా డౌన్‌లోడ్ అవుతుంది.

మొబైల్ డేటాను సేవ్ చేసేందుకు మీడియాలో ఆటో-డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 2.23.2.11 బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం, మీరు యాప్‌లో ఆటోమేటిక్, బెస్ట్ క్వాలిటీ, డేటా సేవర్‌తో సహా 3 ఫోటో క్వాలిటీ ఆప్షన్లను పొందవచ్చు. కానీ, బెస్ట్ క్వాలిటీ అంత ప్రభావవంతంగా లేదు. యాప్‌లో అధిక రిజల్యూషన్ ఫొటోలను అందించదు. బెస్ట్ క్వాలిటీ ఆప్షన్‌లో యాప్ ఏ ఇమేజ్ సైజును సపోర్ట్ చేస్తుందో WhatsApp వెల్లడించలేదు.

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉందని, భవిష్యత్తులో అందరి యూజర్లకు అందుబాటులోకి రానుందని ఓ నివేదిక వెల్లడించింది. వాట్సాప్ (Whatsapp) ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో విషయాలను షేర్ చేసుకోవచ్చు. రాబోయే అప్‌డేట్ ద్వారా మరింత మెరుగైన మెసేజింగ్ యాప్‌గా పనిచేస్తుంది. టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లు ఇప్పటికే యూజర్లు పెద్ద ఫైల్‌లు లేదా హై-క్వాలిటీ ఫొటోలను పంపుకునేందుకు అనుమతిస్తున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo Reno 8T 5G : ఒప్పో రెనో 8T 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు