WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూపు కాల్స్‌లో 32మంది మాట్లాడుకోవచ్చు..!

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

WhatsApp Group Calls : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. కమ్యూనిటీస్ ట్యాబ్, ఎమోజీ రియాక్షన్స్ వంటి ఫీచర్లతో పాటు గ్రూపు కాలింగ్ ఫీచర్ కూడా తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్లను వాట్సాప్ ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ ప్రవేశపెట్టబోయే గ్రూపు కాలింగ్ ఫీచర్‌లో యూజర్ల పరిమితిని పెంచనుంది.

ఇప్పటివరకూ వాట్సాప్ గ్రూపు వాయిస్ కాలింగ్ చేసేటప్పుడు 8 మందికి మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉంది. కానీ, వాట్సాప్ గ్రూపులో వాయిస్ కాలింగ్ ఏకంగా 32 మంది వరకు పాల్గొనేందుకు అనుమతించనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకసారి గ్రూపు వాయిస్ కాలింగ్‌లో 32 మందికి వాట్సాప్ అనుమతించనుందని Wabetainfo పేర్కొంది. దీనికి సంబంధించి టిప్‌స్టర్ (Tipster) యాప్ స్క్రీన్‌షాట్‌ షేర్ చేసింది. గ్రూపు కాల్స్ ఇప్పుడు 32 మంది పాల్గొనేందుకు సపోర్టు అందిస్తుంది. సోషల్ ఆడియో లేఅవుట్, స్పీకర్ హైలైట్ వేవ్‌ఫారమ్‌లతో ఇంటర్‌ఫేస్‌ను కొత్తగా వాట్సాప్ అప్‌డేట్ చేయనుంది.

Whatsapp Starts Rolling Out Ability To Add 32 Contacts To Group Calls

అంతేకాదు.. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ బబుల్స్ కాంటాక్ట్‌లు, గ్రూప్‌ల ఇన్ఫో స్కోర్‌ డిజైన్‌లను రిలీజ్ చేయనుంది. వాట్సాప్ అందించే గ్యాలరీలో మీకు ఇష్టమైన మీడియాను యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ బ్రెజిల్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. WhatsApp కమ్యూనిటీస్ ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. వేర్వేరు గ్రూపులను ఒకే చోట కనెక్ట్ అయ్యేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. వేర్వేరు గ్రూపుల్లోని వాట్సాప్ యూజర్లు ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఒక చోట కనెక్ట్ అయ్యేందుకు అనుమతించనుంది.

అలాగే, వాట్సాప్ యూజర్లు త్వరలో 2GB వరకు ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుత సెటప్ WhatsApp యూజర్లు తమ స్నేహితులకు 100MB వరకు ఫైల్‌లను పంపడానికి మాత్రమే అనుమతి ఉంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు తమ కాంటాక్ట్‌లతో పెద్ద ఫైల్‌లను షేర్ చేసుకోగలరు. మరోవైపు వాట్సాప్ సింగిల్ అకౌంట్‌ను 10వరకు మల్టీ డివైజ్‌లను కనెక్ట్ చేసేందుకు పెయిడ్ సబ్ స్ర్కిప్షన్ ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ సాయంతో మీరు ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్ టాప్ నుంచి ఒకే వాట్సాప్ అకౌంట్ ద్వారా మల్టీ డివైజ్ లను యాక్సస్ చేసుకోవచ్చు.

Read Also : WhatsApp Paid Subscription : వాట్సాప్‌లో కొత్త పెయిడ్ ఫీచర్.. సింగిల్ అకౌంట్‌తో ఒకేసారి మల్టీ డివైజ్‌ల్లో..!

ట్రెండింగ్ వార్తలు