WhatsApp Username Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై యూజర్‌నేమ్‌తో సెర్చ్ చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Search Feature : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. యూజర్‌నేమ్‌ని ఉపయోగించి ఇతరుల వివరాలను సెర్చ్ చేసేందుకు అనుమతినిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ ప్రైవసీని మరింత ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

WhatsApp Search Feature : ప్రమఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తమ యూజర్ల కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. రాబోయే ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ యూజర్ నేమ్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ ఈ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌పై పనిచేస్తోందని నివేదిక పేర్కొంది.

ఈ ఫీచర్‌తో వినియోగదారులు ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌ని ఉపయోగించి ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపై, యూజర్ కాంటాక్టు ఫోన్ నంబర్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ 2.23.25.19 అప్‌డేట్ లేటెస్ట్ వాట్సాప్ బీటా యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఫ్యూచర్ అప్‌డేట్ కోసం వాట్సాప్ ఈ ఫీచర్‌కి సంబంధించి మరింత అప్‌గ్రేడ్ చేస్తోందని నివేదిక వెల్లడించింది.

యూజర్ నేమ్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే :
నివేదిక ప్రకారం.. సెర్చ్‌ బార్‌లో యూజర్లు తమ యూజర్ నేమ్ ద్వారా ఇతర యూజర్ల కోసం సెర్చ్ చేసేందుకు అనుమతిస్తుంది. పర్సనల్ ఫోన్ నంబర్‌లను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. యూజర్ల ప్రైవసీని మెరుగుపరచడంతో పాటు యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసే ఆప్షన్ పూర్తిగా ఆప్షనల్‌గా ఉంటుంది. వినియోగదారులు తమ ప్రస్తుత యూజర్ నేమ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు.

Read Also : WhatsApp View Once : వాట్సాప్ డెస్క్‌టాప్‌లో ‘వ్యూ వన్స్‘ ఫీచర్ మళ్లీ వస్తోంది.. ఫొటోలు, వీడియోలను స్టోర్ చేయడం కుదరదు!

ఈ ఫీచర్‌పై యూజర్లకు ఎల్లప్పుడూ కంట్రోల్ ఉంటుందని నివేదిక పేర్కొంది. యూజర్‌నేమ్‌ని ఉపయోగించి ఇతరుల కోసం సెర్చ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వినియోగదారులకు ప్రైవసీపరంగా మరింత ప్రొటెక్షన్ అందిస్తుందని సూచించింది. వాట్సాప్ వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌లను తప్పనిసరిగా బహిర్గతం చేయకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు వీలుంటుంది. యూజర్ల వ్యక్తిగత సమాచారంపై పూర్తి కంట్రోల్ కొనసాగించాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

WhatsApp Search By Username Feature

ఫోన్ నెంబర్‌తో పనిలేదు.. :
అదనంగా, యూజర్‌నేమ్‌ల ద్వారా వినియోగదారులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర వ్యక్తులతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఎందుకంటే.. ఫోన్ నంబర్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. యూజర్‌లు ఇకపై తమ యూజర్‌నేమ్‌లను మాత్రమే షేర్ చేస్తారు. తద్వారా యాప్‌లో ఇతరులను కనుగొనడం, వారితో కనెక్ట్ అవ్వడం సులభం అవుతుందని (WABetaInfo) తెలిపింది. ప్రస్తుతం వాట్సాప్‌లో యూజర్ నేమ్ ద్వారా సెర్చ్ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఈ యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌తో అందుబాటులో ఉంటుంది.

మరోవైపు.. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాట్సాప్ చాట్ లాక్ కోసం సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని సున్నితమైన చాట్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మిలియన్ల మంది యూజర్లకు అదనపు ప్రైవసీని అందిస్తోంది. సీక్రెడ్ కోడ్‌ని క్రియేట్ చేసిన తర్వాత లాక్ చేసిన చాట్‌లను హైడ్ చేసేందుకు ఉపయోగించబడుతుంది. తద్వారా సెర్చ్ బాక్సులో టైప్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి.

Read Also : WhatsApp Secret Code : వాట్సాప్‌లో లాక్ చాట్స్ కోసం సీక్రెట్ కోడ్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు