×
Ad

Whatsapp iPhone : ఐఫోన్ యూజర్లకు పండగే.. ఇకపై ఒకే ఐఫోన్‌లో మల్టీ వాట్సాప్ అకౌంట్లు వాడొచ్చు.. ఎలాగంటే? ఫుల్ డిటెయిల్స్..!

Whatsapp iPhone : వాట్సాప్ ఐఫోన్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్ రాబోతుంది. ఇకపై ఒకే ఐఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..

Whatsapp iPhone

Whatsapp iPhone : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ ఒకే డివైజ్‌లో రెండు అకౌంట్లను వాడేసుకోవచ్చు. iOSలో వాట్సాప్ చాలా కాలంగా ఈ మల్టీ అకౌంట్ ఫీచర్‌ పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు ఐఫోన్ యూజర్ల కోసం అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఒకే ఫోన్‌లో ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే బీటా టెస్టింగ్‌లో అందుబాటులో ఉంది.

అయితే, అప్లికేషన్ స్టేబుల్ వెర్షన్ రిలీజ్ (Whatsapp iPhone) కావాల్సి ఉంది. దీనిపై మెసేజింగ్ యాప్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. వాట్సాప్ అన్ని బీటా వెర్షన్ ఐఫోన్ యూజర్లు టెస్ట్ ఫ్లయిట్ నిర్మించిన ఫీచర్‌ను యాక్సస్ చేయొచ్చు. ప్రారంభ యూజర్ రిపోర్టులను పరిశీలిస్తే.. ఈ ఫీచర్ కచ్చితంగా ఐఫోన్ యూజర్ల అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

iOS వాట్సాప్‌లో మల్లీ అకౌంట్లు :
కొందరు వాట్సాప్ యూజర్లు వర్క్ ప్రైవసీ కోసం పర్సనల్‌గా వాట్సాప్‌ను వాడుతుంటారు. ఇలాంటి యూజర్లు గతంలో మరో డివైజ్ లేదా వాట్సాప్ బిజినెస్ యాప్ వాడేవారు. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకుంటే.. ఇకపై టెస్ట్‌ఫ్లైట్ వెర్షన్ మల్టీ అకౌంట్ సపోర్టును తెస్తోంది. ఈ ఫీచర్ త్వరలోనే రెగ్యులర్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

Read Also : Upcoming Smartphones : కొత్త ఫోన్ కావాలా బ్రో.. వచ్చే డిసెంబర్‌లో రాబోయే 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

చాలా మంది టెస్టర్లు ఇప్పటికే వాట్సాప్ సెట్టింగ్స్‌లో కొత్త సెక్షన్ ఉన్నట్టు గుర్తించారు. WABetaInfo నివేదిక ప్రకారం.. ‘మల్టీ అకౌంట్ల మధ్య మారే ఆఫ్షన్ ఇప్పుడు యాప్ Settings మెనూలో అందుబాటులో ఉంది’ అని పేర్కొంది. దీని ప్రకారం.. భవిష్యత్తులో, యూజర్ల సెట్టింగ్స్ లోపల కొత్త ‘Account List’ లేదా స్పెషల్ బటన్‌ చూడవచ్చు.

ప్రస్తుతానికి, బీటా వెర్షన్ యూజర్లకు ఒకేసారి రెండు వాట్సాప్ అకౌంట్లను యాక్సస్ చేసేందుకు అనుమతిస్తుంది. అయినప్పటికీ, టెస్టర్లు మొదటిసారిగా వాట్సాప్‌లో పూర్తిగా కొత్త నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడైంది. అంతేకాకుండా, వినియోగదారులు వాట్సాప్ బిజినెస్‌లో వాడే వారి పాత అకౌంట్లను కూడా తిరిగి కనెక్ట్ అవ్వొచ్చు.

అకౌంట్ లింక్ చేసిన వెంటనే అన్ని చాట్స్ ఆటోమాటిక్‌గా సింకరైజ్ అవుతాయి. ఈ ఫీచర్ స్టేబుల్ వెర్షన్‌లోకి వస్తే.. కచ్చితంగా యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రయల్స్ సమయంలో అన్ని సరిగ్గా ఉంటే వాట్సాప్ స్టేబుల్ వెర్షన్‌లో కూడా ఈ ఫీచర్‌ త్వరలోనే రావచ్చు.