WhatsApp Voice Messages : వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను ఇకపై స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Voice Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ బీటా వెర్షన్‌లో వాయిస్ స్టేటస్ అప్‌డేట్‌ను టెస్టింగ్ చేస్తోంది.

WhatsApp Voice Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ బీటా వెర్షన్‌లో వాయిస్ స్టేటస్ అప్‌డేట్‌ను టెస్టింగ్ చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ సాధారణ చాట్‌లకు వాయిస్ మెసేజ్‌లను పంపేందుకు మాత్రమే అనుమతిస్తుంది. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌గా వాయిస్ నోట్‌ను షేర్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. WaBetaInfo 2.22.21.5 ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌లో కొత్త ఫీచర్‌ను గుర్తించింది. అర్హత కలిగిన యూజర్లు యాప్‌లోని టెక్స్ట్ స్టేటస్ సెక్షన్‌లో చూడవచ్చు.

వాట్సాప్‌లో మీ వాయిస్ స్టేటస్ అప్‌డేట్‌ని ఎవరెవరు చెక్ చేయగలరో కూడా కాన్ఫిగర్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. యాప్ రికార్డింగ్‌ను పబ్లిక్ చేసే ముందు విస్మరించే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. వాట్సాప్ వాయిస్ రికార్డింగ్‌లపై కంట్రోల్ కూడా పొందవచ్చు. సాధారణ చాట్‌ల కోసం WhatsApp అందించే విధంగా ప్లే పాజ్ ప్రాసెస్ కూడా ఉంటుందో లేదో రివీల్ చేయలేదు. మీరు వాట్సాప్‌లో ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు వాట్సాప్‌ను క్లోజ్ చేసినా మీరు ఎక్కడి నుంచి వెళ్లిన మెసేజింగ్‌ను రికార్డ్ చేయడం కొనసాగించాలో కూడా యాప్ ఆటోమేటిక్‌గా మీ వాయిస్ మెసేజ్‌లను సేవ్ చేస్తుంది.

WhatsApp to let you set voice messages as Status

Read Also : iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

వాయిస్ స్టేటస్ ఫీచర్‌లో ఎడిట్ లేదా రీప్లే ఆప్షన్ ఉంటుందా అనేది క్లారిటీ లేదు. ఈ ఫీచర్ మరింత మందికి అందుబాటులోకి రానుంది. యూజర్లు తమ కంటెంట్‌ను లేదా మరేదైనా మంచి మార్గంలో ప్రచారం చేసేందుకు కూడా సాయపడుతుంది. ఎవరైనా తమ పాటలను కాంటాక్టులతో షేర్ చేయాలనుకుంటే.. యూజర్లు స్టేటస్‌లో ఫోటోను పోస్ట్ చేయవచ్చు. వాయిస్ స్టేటస్ ఫీచర్‌ని ఉపయోగించి మాట్లాడవచ్చు. ఈ ఫీచర్‌పై టైమ్ లిమిట్ కూడా ఉంది.

వాట్సాప్ యూజర్లు కేవలం 30 సెకన్ల పాటు వాయిస్ నోట్‌ని రికార్డ్ చేయవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో స్టేటస్‌గా పోస్ట్ చేసే ఇమేజ్‌లు లేదా వీడియోలతో జరిగే విధంగా స్టేటస్ సెక్షన్ ద్వారా షేర్ చేసిన వాయిస్ నోట్స్ 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. వాటిని అప్‌లోడ్ చేసిన తర్వాత కూడా వాయిస్ స్టేటస్‌ని డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ ఇంకా టెస్టింగ్ స్టేజీలో ఉంది. WhatsApp ఆప్షన్ Android బీటా టెస్టర్‌ల కోసం ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో ఎక్కువ మంది వాట్సాప్ యూజర్లకు అప్‌డేట్ వస్తుంది. స్టేబుల్ వెర్షన్‌ని ఉపయోగిస్తున్న వారి కోసం ఈ ఫీచర్‌ని రిలీజ్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని సూచిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Nord CE 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు