Whatsapp: ఒకే వాట్సప్ అకౌంట్.. వేరే ఫోన్‌లో కూడా

వాట్సప్‌లోకి మరో కొత్త ఫీచర్ రానుంది. మల్టీ డివైజ్ 2.0తో వాట్సప్ పనిచేయనుందని.. దీంతో ఒకే అకౌంట్ తో రెండో ఫోన్ కు కూడా లింక్ చేయొచ్చని WABetaInfo వెల్లడించింది.

 

Whatsapp: వాట్సప్‌లోకి మరో కొత్త ఫీచర్ రానుంది. మల్టీ డివైజ్ 2.0తో వాట్సప్ పనిచేయనుందని.. దీంతో ఒకే అకౌంట్ తో రెండో ఫోన్ కు కూడా లింక్ చేయొచ్చని WABetaInfo వెల్లడించింది.

ప్రాథమిక నంబర్‌ను ఎంగేజ్ చేయకుండా అదనపు ఫోన్ లేదా ప్యాడ్ ద్వారా WhatsAppని ఉపయోగించడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు సహాయపడుతుంది. కొత్త ఫీచర్ వివిధ వాట్సాప్ లాగిన్ కోసం మల్టిపుల్ సిమ్ కార్డ్‌ల నుంచి వచ్చే గందరగోళాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇది ఫ్యూచర్ అప్‌డేట్.. ఊహించిన దాని కంటే డిఫరెంట్ గా కనిపించొచ్చు. మెసేజింగ్ యాప్ దాని మధ్య ఉన్న ఇతర ప్రాసెస్‌లతో చాట్ చేయడాన్ని సులభతరం చేయడానికి యాప్‌లోని ఫీచర్‌లతో నిరంతరం అప్‌డేట్ అవుతుంది.

Read Also: ఈ ఐఫోన్లలో వాట్సప్ ఇక పనిచేయనట్లే

ఒక ఫోన్ లేదా ఒక ట్యాబ్‌లో WhatsAppని ఉపయోగిస్తుంటే, దానికి వెబ్‌ను కూడా కనెక్ట్ చేయొచ్చు. iOS, Android రెండింటినీ కనెక్ట్ చేసే అదనపు మొబైల్ ఫోన్ లేదా iPad WhatsApp వినియోగదారులకు సమయం, శ్రమను ఆదా చేస్తుంది.

ఫోన్‌ని మార్చినప్పుడు వాట్సప్‌ని ఇన్‌స్టాల్ చేసిన ప్రతిసారీ, డేటా, చాట్ హిస్టరీని సింక్రొనైజ్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే పంపబడే ఆరు అంకెల కోడ్ మీకు లభిస్తుంది. మల్టీపుల్ డివైజ్ 2.0 నవీకరణతో ఇది అవసరం లేదు.

 

ట్రెండింగ్ వార్తలు