WhatsApp upcoming feature may soon allow users to edit sent messages
WhatsApp Upcoming Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్ ప్రైవసీ, యాప్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. లేటెస్ట్ యాప్ WhatsApp iOS వెర్షన్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్, క్యాప్షన్‌లతో మీడియాను ఫార్వార్డ్ చేయడం, మెసేజ్ యువర్ సెల్ఫ్, iOS, Android, Web యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేసింది. వాట్సాప్ డెవలపర్‌లు ఫ్యూచర్ యాప్ అప్‌డేట్‌తో సరికొత్త ఫీచర్లను రూపొందించే పనిలో ఉన్నారు. అదే డెవలప్‌మెంట్ లైన్‌లో ఉన్న ఫీచర్లలో ఒకటి.. పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయడం.. Wabetainfo ప్రకారం.. వాట్సాప్ ఫీచర్లలో డెవలపర్లు మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నారని వెల్లడించింది.
యాప్ ఫ్యూచర్ అప్‌డేట్ మెసేజ్‌లను ఎడిట్ చేసే సామర్థ్యాన్ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది. కొత్త ఎడిట్ మెసేజ్ ( Edit Message) ఫీచర్ యూజర్లు పంపిన ఏదైనా మెసేజ్‌ని టైమ్ ఫ్రేమ్ నుంచి 15 నిమిషాలలోపు ఎడిట్ చేసేందుకు అనుమతిస్తుందని నివేదిక సూచిస్తుంది. వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లో ఏదైనా తప్పును సవరించడానికి మరింత సమాచారాన్ని చేర్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. వాట్సాప్ ఇప్పటికే ప్రతి ఒక్కరికి పంపిన ఏదైనా మెసేజ్ డిలీట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. వాట్సాప్‌లో ఎవరైనా మొత్తం మెసేజ్ డిలీట్ చేయకూడదని అనుకుంటే.. దానికి బదులుగా కొన్ని పదాలను ఎడిట్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
WhatsApp upcoming feature may soon allow users to edit sent messages
అదనంగా, వాట్సాప్ ఫీచర్‌లో లేటెస్ట్ WhatsApp వెర్షన్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. వాట్సాప్ మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు మాత్రమే అనుమతిస్తుంది. మీడియా క్యాప్షన్లను అనుమతించదు. ప్రస్తుతం, ఈ ఫీచర్ iOS యూజర్ల కోసం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో బీటా టెస్టింగ్ కోసం కొత్త అప్‌డేట్ రిలీజ్ చేస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో యాప్ అప్‌డేట్‌లో యూజర్లు కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. ఇంతలో, WhatsApp iOS యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను కూడా టెస్టింగ్ చేస్తోంది. iOS డివైజ్‌లలో ఇమేజ్ క్వాలిటీని మార్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం, ఈ ఫీచర్ అప్‌డేట్ టెస్ట్ ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్‌లో వెర్షన్ 23.4.0.70ని కలిగిన iOS బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.
వాట్సాప్ (WhatsApp) చాట్ సెట్టింగ్‌లలో కొత్త ఫొటో క్వాలిటీ ఆప్షన్ పొందవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలను పంపవచ్చు. ప్రస్తుతం, WhatsApp డేటాను ఆదా చేసేందుకు యూజర్ల ఫొటోలను కంప్రెస్ చేస్తుంది. హై క్వాలిటీతో ఫొటోలను పంపేందుకు యూజర్లు తమ మీడియాను డాక్యుమెంట్లుగా మార్చుకోవాలి. ఈ కొత్త అప్‌డేట్‌తో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లో హైక్వాలిటీ ఫొటోలను పంపడానికి వాట్సాప్ యూజర్లను అనుమతిస్తుంది. వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం అదే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఫొటో క్వాలిటీ సెట్టింగ్‌లను మార్చేందుకు WhatsApp Settings> Storage Data > Media Upload Quality > మీ ప్రాధాన్యత ప్రకారం (Photo Quality) సెట్టింగ్‌ను మార్చండి.