Whatsapp Upcoming Features, Now You Can Check These Updates
WhatsApp New Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. భారత్‌లో ప్రైవసీ పాలసీ వివాదం నడుస్తోంది. అయినప్పటికీ వాట్సాప్ మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆండ్రాయిండ్, ఐఫోన్ యూజర్లకు కొన్ని స్పెషల్ ఫీచర్లు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో ఒకటి వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫామ్స్ (Whatsapp Voice Waveforms), రెండోది వ్యూ వన్స్ ఫీచర్ (View Once Feature).. మూడోది.. Redesigned in-app notifications (రిడిజైన్డ్ ఇన్-యాప్ నోటిఫికేషన్స్) ఈ మూడు వాట్సాప్ ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
Redesigned in-app notifications:
పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ తమ సొంత యాప్ వాట్సాప్ ను రీడిజైన్ చేస్తోంది. యాప్ నోటిఫికేషన్లలో కొత్త మార్పులు చేస్తోంది. నోటిఫికేషన్ బ్యానర్, ఫొటోలు, వీడియోలు, GIF స్టిక్కర్లలో ఎక్కువ సమాచారం ఉండేలా వాట్సాప్ అడుగులు వేస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. యాప్ నోటిఫికేషన్‌ను వాట్సాప్ యూజర్లు పెద్దదిగా చేసుకుని ఛాట్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో నేరుగా స్క్రోల్ చేసి పాత మెసేజ్ లు కూడా చెక్ చేసుకోవచ్చు.
View Once Feature :
రెండోది.. వ్యూ వన్స్ ఫీచర్ (View Once Feature) ఒకటి. మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్, GIF ఇమేజ్ పంపితే ఓపెన్ చేసి ఎన్నిసార్లయినా చెక్ చేసుకోవచ్చు. అదే ఈ ఫీచర్ ద్వారా మీరు పంపించే మెసేజ్, వీడియోలు, పొటోలు అవతలి వ్యక్తి ఒకసారి చూశాక.. చాట్ నుంచి బయటకు వస్తే చాలు అంతా మాయమైపోతుంది. టెక్ట్స్, ఫొటో, GIF మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
Voice Waveforms :
వాట్సాప్ మూడో ఫీచర్.. వాయిస్ వేవ్‌ఫామ్స్ (Voice Waveforms).. వాయిస్ మెసేజ్ లకు వాయిస్ వేవ్ ఫామ్స్ ఇదో కొత్త ట్రెండ్.. వాట్సాప్ బీటా ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. iOS యూజర్లకు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందని సమాచారం. ఇప్పటివరకూ వాయిస్ మెస్సేజ్ వింటుంటే బార్ ముందుకు వెళ్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వేవ్స్ మాదిరిగా మెసేజ్ డిస్ ప్లే అవుతుంది.