Whatsapp Spyware Attack
Whatsapp Spyware Attack : వాట్సాప్ యూజర్లకు డేంజరస్ అలర్ట్.. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి. వాట్సాప్ జీరో-క్లిక్ హ్యాక్ ద్వారా హ్యాకర్లు యూజర్ల ప్రమేయం లేకుండా ఆయా లింక్‌పై క్లిక్ చేయకుండానే ఫోన్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ పేరంట్ కంపెనీ మెటా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రత్యేకంగా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ధృవీకరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు అడ్వాన్స్‌డ్ స్పైవేర్ దాడి కారణంగా తీవ్రమైన భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం.. ప్రమాదకరమైన సైబర్ దాడి కనీసం 24 దేశాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు సూచించింది.
ఒక్క ఇటలీలోనే ఏడు కేసులు వెలుగులోకి వచ్చాయి. షాకింగ్ విషయం ఏంటంటే? వినియోగదారులు ఎలాంటి లింక్‌ను క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే హ్యాకర్లు డివైజ్‌లను యాక్సస్ చేయగలిగారు.
వాట్సాప్ యూజర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ స్పైవేర్ దాడి :
ఇజ్రాయెల్ నిఘా సంస్థ పారగాన్ సొల్యూషన్స్‌తో ఇంటిగ్రేట్ అయిన స్పైవేర్‌ను ఉపయోగించి జర్నలిస్టులు, కార్యకర్తలు, పౌర సమాజ సభ్యుల వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేశారు.
ఈ స్పైవేర్ అటాక్ అనేది “జీరో-క్లిక్” హ్యాకింగ్ టెక్నిక్‌ను ఉపయోగిస్తుంది. అంటే, బాధితుడి ప్రమేయం లేకుండానే వారి డివైజ్ హ్యాక్ అవ్వచ్చు. ఈ రకమైన హ్యాకింగ్ ట్రెడేషనల్ భద్రతా చర్యలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు.
వాట్సాప్ అటాక్‌పై మెటా స్పందన :
వాట్సాప్ పేరంట్ కంపెనీ మెటా, హ్యాకింగ్ ప్రయత్నాలను ధృవీకరించింది. వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్న స్పైవేర్‌ను కంపెనీ గుర్తించి వెంటనే ఇటలీ జాతీయ సైబర్ భద్రతా సంస్థను అప్రమత్తం చేసింది.
లూకా కాసారిని : మైగ్రెంట్ రెస్క్యూ కార్యకర్త, మెడిటరేనియా సేవింగ్ హ్యూమన్స్ సహ వ్యవస్థాపకురాలు
ఫ్రాన్సిస్కో క్యాన్సెల్లాటో : ప్రముఖ పరిశోధనాత్మక పాత్రికేయుడు తన డివైజ్ హ్యాక్ అయిందని హెచ్చరిస్తూ కాసారిని తనకు వచ్చిన వాట్సాప్ హెచ్చరికను కూడా షేర్ చేశారు.
‘హ్యాకింగ్’ ఘటనపై ఇటాలియన్ ప్రభుత్వం దర్యాప్తు :
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఆఫీసు హ్యాకింగ్ ఘటనను తీవ్రంగా ఖండించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని హామీ ఇచ్చింది. అయితే, ఈ స్పైవేర్ అటాక్‌తో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రభుత్వం ఖండించింది. ప్రైవసీ కారణాల వల్ల, బాధితుల పూర్తి జాబితాను వెల్లడించేందుకు నిరాకరించింది.
వాట్సాప్ యూజర్లు డేటాను ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి :
మీ వాట్సాప్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.
అదనపు భద్రత కోసం టు-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.
అనుమానాస్పద కాల్స్, గుర్తుతెలియని మెసేజ్‌లను నివారించండి
జీరో-క్లిక్ హ్యాకింగ్ పెద్ద ముప్పుగా మారుతోంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వాట్సాప్ యూజర్లు తమ ఫోన్లను హ్యాకర్లు, స్కామర్ల నుంచి రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.