WhatsApp Transfer Chats : క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మీ ఫోన్‌లో వాట్సాప్ చాట్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..!

WhatsApp Transfer Chats : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కి చాట్‌లను ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

WhatsApp users can now transfer chats from one phone to another simply by scanning a QR code

WhatsApp Transfer Chats : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ రాబోయే కొత్త ఫీచర్‌ను వెల్లడించారు. అదే ఆపరేటింగ్ సిస్టమ్‌ రన్ అయ్యే ఫోన్‌ల మధ్య వాట్సాప్ మెసేజ్‌లను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఉదాహరణకు.. మీరు ఐఫోన్ నుంచి మరో ఐఫోన్‌కు మారాలనుకుంటే.. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చాట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

అదేవిధంగా, మీ చాట్ హిస్టరీలను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో నిమిషాల వ్యవధిలో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ కొత్త చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ సాయంతో మీ పాత ఫోన్‌లోని డేటాను QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ కొత్త డివైజ్‌లో ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకు క్లౌడ్ బ్యాకప్‌ అవసరం ఉండదు. రెండు డివైజ్‌ల మధ్య డేటా ప్రత్యేకంగా షేర్ అవుతుంది. డేటా ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్‌లో పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవుతుందని వాట్సాప్ యూజర్లకు హామీ ఇస్తుంది.

Read Also : WhatsApp Desktop : వాట్సాప్ డెస్క్‌టాప్‌లో అదిరే ఫీచర్.. గ్రూపు వీడియో, ఆడియో కాల్స్‌లో 32మంది పాల్గొనవచ్చు..!

ప్రస్తుత క్లౌడ్-ఆధారిత ఈ కొత్త ప్రాసెస్ ద్వారా డేటా స్పీడ్ సులభంగా పెరిగే అవకాశం ఉంది. గతంలో, యూజర్లు తమ చాట్ హిస్టరీని iCloud లేదా Google డిస్క్‌కి బ్యాకప్ చేయొచ్చు. ఆపై డేటాను కొత్త డివైజ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే, ఈ మెథడ్ తరచుగా ఫ్రీ iCloud అకౌంట్లపై 5GB క్యాప్ వంటి క్లౌడ్ స్టోరేజీ ద్వారా లిమిట్ అందిస్తుంది. ఈ కొత్త చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో అలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫీచర్ ఒకే ఆపరేటింగ్ సిస్టమ్‌తో రెండు డివైజ్‌ల మధ్య మాత్రమే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో డేటా ట్రాన్స్‌ఫర్ లేదా iOS నుంచి iOS డివైజ్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

WhatsApp users can now transfer chats from one phone to another simply by scanning a QR code

మీరు రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల మధ్య మీ చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే.. మీరు మీ డేటాను ట్రాన్స్‌ఫర్ దిశను బట్టి ప్రాసెస్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. వాట్సాప్ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి డేటా మారడానికి స్పెషల్ హెల్ప్ పేజీని అందిస్తుంది. అలాగే, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు పేజీని అందిస్తుంది. WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ Android, iOS ప్లాట్‌ఫారమ్‌లలోని బీటా టెస్టర్‌లకు క్రమంగా అందుబాటులోకి రానుంది. క్లౌడ్ బ్యాకప్‌ల అవసరం లేకుండా సురక్షితమైన QR కోడ్ స్కాన్‌ ద్వారా కొత్త చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ యూజర్లు తమ వాట్సాప్ చాట్ డేటాను కొత్త డివైజ్‌లకు ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Read Also : Motorola G32 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా G32 ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!