PM Modi Phone
PM Modi Phone : సాధారణంగా దేశ ప్రధానులు ఎలాంటి టెక్ గాడ్జెట్‌లు వాడతారు? ఎలాంటి ఫోన్లు వాడతారు. అందరిలా మన ఫోన్లనే వాడతారా? లేదా వారికోసం ఏమైనా ప్రత్యేకంగా గాడ్జెట్లు ఉంటాయా? ఇలాంటి సందేహాలే చాలామందిలో ఉంటాయి. ఆయా ఫోన్లు, గాడ్జెట్ల గురించి తెలుసుకోవాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. దేశ ప్రధానమంత్రి వ్యక్తిగత విషయాల గురించి ప్రజలకు కచ్చితంగా తెలుసుకోవాలని ఉంటుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని హోదాలో ఉండే వారిగురించి ప్రతిదీ బహిరంగంగా వివరాలు అందుబాటులో ఉండవు.
అయితే, ఒక బ్లాగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Phone) ఏ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు అనేది రివీల్ అయింది. ఈ హైసెక్యూరిటీ ఫోన్ హ్యాకర్లకు కూడా అందదు. అందులో సెక్యూరిటీ ఫీచర్లు అలా డిజైన్ చేసి ఉంటాయి. ఇంతకీ ఆ ఫోన్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రధాని మోదీ వద్ద సాధారణ ఫోన్ ఉండదు. ఆయన సెక్యూరిటీ పరంగా మనం వాడే ఫోన్లలో మాట్లాడరు. ఇందుకోసం అనేక సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన స్పెషల్ మొబైల్ ఉంటుంది. ఇంతకీ ఆ ఫోన్ ఏంటి? అందులో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రధాని మోదీ వాడేది RAX ఫోన్ :
సెప్టెంబర్ 2024 బ్లాగ్ పోస్ట్ (Airtel.in) ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక RAX మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఈ RAX ఫోన్ మిలిటరీ ఫ్రీక్వెన్సీలపై పనిచేస్తుంది. త్రి లేయర్ ఎన్‌క్రిప్షన్ కలిగి ఉంది. ఈ ఫోన్ సెక్యూరిటీ బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి స్వయంగా ఈ ఫోన్‌లో కాల్స్ చేయరు. ఆయనకు బదులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ కాల్స్ చేస్తారట. ఇలాంటి కాల్స్ విషయంలో మరింత సెక్యూరిటీ ఉంటుంది.
హ్యాక్ చేయలేరు.. ట్రాకింగ్ అసాధ్యం :
RAX మొబైల్ ఫోన్లు అంటే.. ‘రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఎక్స్ఛేంజ్’. ఆర్ఏఎక్స్ ఫోన్‌లను భారత C-DoT డెవలప్ చేసింది. అత్యంత సురక్షితమైన ఫోన్‌లుగా చెప్పొచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లోనే సంభాషణలు కాల్ ప్రారంభం నుంచి ఎన్‌క్రిప్ట్ అవుతాయి. ఈ ఫోన్లను హ్యాక్ చేయడం లేదా ట్రాక్ చేయడం అసాధ్యం. ఎందుకంటే ప్రత్యేకించి హైప్రోఫైల్ వ్యక్తులు ప్రైవసీగా మాట్లాడేందుకు ఈ ఫోన్లు తయారయ్యాయి.
ఈ సెక్యూరిటీ ఫోన్ ఆపరేట్ చేయాలంటే.. ఫింగర్ ఫ్రింట్ తప్పనిసరి. ఈ ఫోన్ వాడే వ్యక్తి మాత్రమే యాక్సస్ చేయగలరు. సేఫ్ ఫోన్ కాల్స్ చేసే సమయంలో లేదా కాల్ చేసిన వ్యక్తి లైవ్ ఫొటో ఈ ఫోన్‌లో కనిపిస్తుంది.కాబట్టి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరూ అనేది తెలిసిపోతుంది.
అలాగే ఈ ఫోన్ ద్వారా మాట్లాడే సంభాషణలు ప్రారంభం నుంచే ఫోన్‌లోనే ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అందుకే ఎవరూ కూడా ఈ ఫోన్ ట్యాప్ చేయలేరు. అసలు వినలేరు. ఈ ఫోన్‌ల సెక్యూరిటీని NTRO, DeitY వంటి ప్రభుత్వ సంస్థలు మానిటరింగ్ చేస్తుంటాయి. త్రి-లేయర్ ఎన్‌క్రిప్షన్ సేఫ్టీ కలిగి ఉంటాయి. దీన్ని బ్రేక్ చేయడం చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
RAX ఫోన్ ధర ఎంతంటే? :
సాధారణంగా ఆర్ఏఎక్స్ ఫోన్‌లు చాలా సురక్షితం. భారత మార్కెట్లో ఈ ఆర్ఏఎక్స్ కచ్చితమైన ధర ఎంత అనేది పబ్లిక్‌గా రివీల్ చేయరని ఎయిర్‌టెల్ బ్లాగ్ పేర్కొంది. ఈ హైసెక్యూరిటీ ఫోన్ల వినియోగానికి ప్రతి ప్రభుత్వ వినియోగదారునికి ప్రభుత్వం నెలకు రూ. 2,354 ఖర్చు చేస్తుందని అంచనా.
అయితే, అందులో ప్రధానంగా రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు ఎక్కువగా ఉంటారు. ఈ RAX ఫోన్‌లు దేశీయ మార్కెట్లో విక్రయించే స్టాండర్డ్ RAX ఫోన్‌లకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే… ప్రభుత్వ అనుమతి ఉన్న వారికి మాత్రమే ఇలాంటి RAX ప్రత్యేక ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.
ఇప్పటి డిజిటల్ ప్రపంచం ఎంత డేంజరస్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతిదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. అందుకే మీరు ఫోన్లలో మాట్లాడే ప్రతి విషయం చాలా సీక్రెట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇలాంటి సెక్యూరిటీ కోసం RAX మొబైల్స్ వాడుతుంటారు. ఈ ఫోన్లు అత్యంత సెక్యూరిటీతో ఉంటాయి. అందుకే హై ప్రొఫైల్ వ్యక్తులు ఇలాంటి ఫోన్లనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇతర ఫోన్లలా ఈ ఆర్ఏఎక్స్ ఫోన్లు మార్కెట్లో దొరకవు.