Vehical
Dual Mode Vehicle : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. పలు దేశాలు దీనిని వాడుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేపడుతున్నాయి. నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయి. తాజాగా..రైలును పోలిన బస్సును తయారు చేసింది జపాన్. ఈ వాహనం రైలు లాగా..పట్టాలపై కూడా పరుగులు పెడుతుంది. డ్యూయల్ మోడ్ వాహనాన్ని (DMV) ప్రపంచలోనే తొలిసారిగా ప్రవేశపెట్టింది. జపాన్ లోని కైయో నగరంలో క్రిస్మస్ సందర్భంగా…దీనిని ప్రారంభించారు.
Read More : V Epiq Cinema: ఆగని అధికారుల దాడులు.. థియేటర్ల మూసివేత!
ఒక మినీ బస్సు, మినీ రైలులాగా ఇది కనిపిస్తుంది. సాధారణ రబ్బర్ టైర్లతో రోడ్డుపై రయ్యి మంటూ దూసుకెళుతుంది. రోడ్డుపై సుమారు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ఇది ప్రయాణిస్తుందని, అదే రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని జపాన్ కు చెందిన ఆసా కోస్ట్ రైల్వే వెల్లడించింది. బస్సులో 21 మంది ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రజా రవాణా కోసం దీనిని రూపొందించింది. ముందు, వెనుక భాగంలో రబ్బర్, స్టీల్ వీల్స్ ను అమర్చారు. ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లో వాహనం ముందున్న స్టీల్ వీల్స్ బయటకు వస్తాయి. ముందుభాగంలో ఉన్న రబ్బర్ టైర్లు కాస్త పైకి ఎత్తులోకి లేస్తాయి. వెనుక వైపు స్టీల్ వీల్స్ బయటకు రావడంతో వెనుక ఉన్న రబ్బర్ టైర్లు పైకి లేస్తాయి. ఇలా..రబ్బర్ టైర్లు డీఎంవీని రైలు పట్టాలపైకి నెట్టుతాయి.
Read More : V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరింత రవాణా సదుపాయం కల్పించేందుకు దీనికి రూపొందించినట్లు ఆసా కోస్ట్ రైల్వే సీఈవో షిగెకి మియురా రాయిటర్స్ తో అన్నారు. స్థానికంగా ఉన్న బస్టాండుల్లో ప్రయాణీకులను ఎక్కించుకుని..రైల్వే స్టేషన్లకు చేరడం సులభమౌతుందన్నారు. ప్రధానంగా వృద్దులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పర్యాటక ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.