ChatGPT Go : వావ్.. ఓపెన్ఏఐ ఆఫర్ అదుర్స్.. చాట్‌జీపీటీ గో ప్లాన్ జస్ట్ రూ.399కే.. ప్రీమియం ఫీచర్లు, సబ్‌స్క్రిప్షన్ ఇలా పొందండి!

ChatGPT Go : ఓపెన్ఏఐ భారతీయ యూజర్ల కోసం చాట్‌జీపీటీ గో కొత్త సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. కేవలం రూ. 399 ధరకు ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

ChatGPT Go : వావ్.. ఓపెన్ఏఐ ఆఫర్ అదుర్స్.. చాట్‌జీపీటీ గో ప్లాన్ జస్ట్ రూ.399కే.. ప్రీమియం ఫీచర్లు, సబ్‌స్క్రిప్షన్ ఇలా పొందండి!

ChatGPT Go Plan

Updated On : August 19, 2025 / 6:00 PM IST

ChatGPT Go Plan : చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఓపెన్‌ఏఐ (OpenAI) భారతీయ మార్కెట్‌ కోసం ఫస్ట్ టైమ్ కొత్త ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఓపెన్‌ఏఐ (ChatGPT GO) అనే కొత్త టైర్ మోడల్ ప్రవేశపెట్టింది. భారతీయ యూజర్ల కోసం అత్యంత సరసమైన ధరలకు ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది.

చాట్‌జీపీటీ హెడ్ నిక్ టర్లీ ‘మేం ఇప్పుడే భారత మార్కెట్లో చాట్‌జీపీటీ గో ప్రారంభించాం. భారతీయ యూజర్లకు ఏఐ మోడల్ ఫీచర్లను యాక్సస్ అందించేందుకు కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్ తీసుకొచ్చాం. 10x హై మెసేజ్ లిమిట్స్, 10x ఇమేజ్ జనరేషన్‌లు, 10x ఫైల్ అప్‌లోడ్‌లు, ఫ్రీ టైర్‌తో పోలిస్తే 2x మెమరీని అందిస్తున్నాం. ఇవన్నీ కేవలం రూ. 399కే అందిస్తున్నాం’ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

చాట్‌జీపీటీ గో ధర, యూపీఐ ఇంటిగ్రేషన్ :

చాట్‌జీపీటీ గో అనేది చాట్‌జీపీటీ ప్లస్, చాట్‌జీపీటీ ప్రో మాదిరిగానే మోడల్ కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్ మాత్రమే. భారత మార్కెట్లో గో వెర్షన్ రూ. 399కు అందుబాటులో ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్‌ కోసం పేమెంట్ పూర్తి చేస్తే సరిపోతుంది.

Read Also : Free Apple Music : పండగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ఫ్రీగా ఆపిల్ మ్యూజిక్.. 6 నెలలు ఎంజాయ్ చేయొచ్చు!

యూపీఐ ద్వారా కూడా సులభంగా పేమెంట్ చేయవచ్చు. మిగిలిన రెండు టైర్లు అదే పాత ధర వద్ద పొందవచ్చు. చాట్‌జీపీటీ ప్లస్ రూ. 1,999, ప్రో ప్లాన్ రూ. 19,999కి పొందవచ్చు. ఓపెన్‌ఏఐ గో టైర్‌ను రిలీజ్ చేసిన ఫస్ట్ మార్కెట్ కూడా మన ఇండియానే..

ChatGPT Go ఫీచర్లు :

ఫ్రీ టైర్ మోడల్‌తో పోలిస్తే.. ఈ సబ్‌స్క్రిప్షన్ 10 రెట్లు ఇమేజ్ జనరేషన్‌లు, 10 రెట్లు ఫైల్ అప్‌లోడ్స్, డబుల్ మెమరీ, 10 రెట్లు మెసేజ్ లిమిట్స్ కూడా పొందవచ్చు.

ChatGPT Go సబ్‌స్క్రైబ్ పొందడం ఎలా? :

  • మీ ఫోన్‌లో ChatGPT యాప్‌ను ఓపెన్ చేయండి. లేదంటే డౌన్‌లోడ్ చేసుకోండి
  • కొత్త అకౌంట్ సెటప్ చేయండి.
  • ఆ తర్వాత అప్‌గ్రేడ్ బటన్‌పై ట్యాప్ చేయండి.
  • చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్ విండో స్క్రీన్‌కు రీడైరెక్ట్ అవుతుంది.
  • Upgrade to Go ట్యాప్ చేసి ఆపై పేమెంట్ ఫార్మాలిటీలను క్లియర్ చేయండి.
  • అంతే.. మీ Go మోడల్ రెడీ అయినట్టే.. ఈజీగా యాక్సస్ చేయొచ్చు.