ChatGPT Go Plan
ChatGPT Go Plan : చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఓపెన్‌ఏఐ (OpenAI) భారతీయ మార్కెట్ కోసం ఫస్ట్ టైమ్ కొత్త ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఓపెన్‌ఏఐ (ChatGPT GO) అనే కొత్త టైర్ మోడల్ ప్రవేశపెట్టింది. భారతీయ యూజర్ల కోసం అత్యంత సరసమైన ధరలకు ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది.
చాట్‌జీపీటీ హెడ్ నిక్ టర్లీ ‘మేం ఇప్పుడే భారత మార్కెట్లో చాట్‌జీపీటీ గో ప్రారంభించాం. భారతీయ యూజర్లకు ఏఐ మోడల్ ఫీచర్లను యాక్సస్ అందించేందుకు కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్ తీసుకొచ్చాం. 10x హై మెసేజ్ లిమిట్స్, 10x ఇమేజ్ జనరేషన్‌లు, 10x ఫైల్ అప్‌లోడ్‌లు, ఫ్రీ టైర్‌తో పోలిస్తే 2x మెమరీని అందిస్తున్నాం. ఇవన్నీ కేవలం రూ. 399కే అందిస్తున్నాం’ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.
చాట్‌జీపీటీ గో అనేది చాట్‌జీపీటీ ప్లస్, చాట్‌జీపీటీ ప్రో మాదిరిగానే మోడల్ కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్ మాత్రమే. భారత మార్కెట్లో గో వెర్షన్ రూ. 399కు అందుబాటులో ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ కోసం పేమెంట్ పూర్తి చేస్తే సరిపోతుంది.
Read Also : Free Apple Music : పండగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ఫ్రీగా ఆపిల్ మ్యూజిక్.. 6 నెలలు ఎంజాయ్ చేయొచ్చు!
యూపీఐ ద్వారా కూడా సులభంగా పేమెంట్ చేయవచ్చు. మిగిలిన రెండు టైర్లు అదే పాత ధర వద్ద పొందవచ్చు. చాట్‌జీపీటీ ప్లస్ రూ. 1,999, ప్రో ప్లాన్ రూ. 19,999కి పొందవచ్చు. ఓపెన్‌ఏఐ గో టైర్‌ను రిలీజ్ చేసిన ఫస్ట్ మార్కెట్ కూడా మన ఇండియానే..
We just launched ChatGPT Go in India, a new subscription tier that gives users in India more access to our most popular features: 10x higher message limits, 10x more image generations, 10x more file uploads, and 2x longer memory compared with our free tier. All for Rs. 399. 🇮🇳
— Nick Turley (@nickaturley) August 19, 2025
ఫ్రీ టైర్ మోడల్‌తో పోలిస్తే.. ఈ సబ్‌స్క్రిప్షన్ 10 రెట్లు ఇమేజ్ జనరేషన్‌లు, 10 రెట్లు ఫైల్ అప్‌లోడ్స్, డబుల్ మెమరీ, 10 రెట్లు మెసేజ్ లిమిట్స్ కూడా పొందవచ్చు.