Xiaomi 14 Smartphone : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి కొత్త షావోమీ 14 ఫోన్ గత నెలలో షావోమీ 14 అల్ట్రాతో పాటు లాంచ్ అయింది. ఇప్పుడు, అమెజాన్‌లో భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంది. వాస్తవానికి 12జీబీ ర్యామ్ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999 ఉండగా, అమెజాన్‌లో ప్రస్తుత ఆఫర్లతో ధరను మరింత తగ్గించాయి. ఈ షావోమీ స్మార్ట్‌ఫోన్ ధర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా భారీగా తగ్గింది. అలాగే, ఆకర్షణీయమైన ఆఫర్లతో షావోమీ 14 స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ. 30,899 వరకు ఉంటుంది. పరిమిత-కాల ఆఫర్ మాత్రమే.
Read Also : Yamaha Aerox S Launch : యమహా ఏరోక్స్ ఎస్ మ్యాక్సీ స్కూటర్ చూశారా? ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?
షావోమీ 14 ఆఫర్ వివరాల ప్రకారం..
షావోమీ 14 స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రస్తుతం అమెజాన్‌లో రూ.79,999గా ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై 13శాతం తగ్గింపుతో ధర రూ. 69,999కి పొందవచ్చు. కస్టమర్లు పాత స్మార్ట్ఫోన్లు వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 34,100 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. షావోమీ ఫోన్ ధర రూ. 35,899కి తగ్గించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు రూ. 5వేల వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఫోన్ తుది ధర రూ. 30,899కి తగ్గుతుంది. గడువు ముగిసేలోపు ఈ ఆఫర్ బెనిఫిట్స్ పొందవచ్చు.
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌లు :
రూ. 30వేలతో కనిష్ట కొనుగోలు విలువ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌ల ఈఎంఐ రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై 3, 6, 9, 12, 18, 24 నెలల ఈఎంఐ ప్లాన్లపై ఫ్లాట్ రూ. 5వేల తగ్గింపును పొందవచ్చు. హెచ్‌డీఎంసీ బ్యాంక్ కార్డ్‌ల ఈఎంఐలపై రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
షావోమీ 14లో ఎస్బీఐ బ్యాంక్ ఆఫర్ :
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ : ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో చేసిన లావాదేవీలపై ఫ్లాట్ రూ. 5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కనిష్ట కొనుగోలు విలువ రూ. 30వేలు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే.. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలల ఈఎంఐ ప్లాన్లపై ఫ్లాట్ రూ. 5వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
ఐసీఐసీ, బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ :
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మినహా)తో చేసిన లావాదేవీలపై ఫ్లాట్ డిస్కౌంట్ రూ. 5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కనీస కొనుగోలు విలువ రూ. 30వేలకు పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ రూ. 30వేల లావాదేవీలకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను (అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మినహా) వినియోగిస్తే.. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12నెలలు, 18 నెలలు, 24 నెలల ఈఎంఐ ప్లాన్లపై ఫ్లాట్ రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు.
షావోమీ 14 స్పెసిఫికేషన్లు :
షావోమీ ఫోన్ 6.36-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో షావోమీ 14 గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1.5కె రిజల్యూషన్‌తో సున్నితమైన ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ ప్రో హెచ్డీఆర్ డిస్ప్లే, హెచ్డీఆర్ 10, హెచ్డీఆర్ 10 ప్లస్, డాల్బీ విజన్‌కి సపోర్ట్ చేస్తుంది. శక్తివంతమైన విజువల్స్‌ని అందిస్తుంది.
ఫొటోగ్రఫీ పరంగా షావోమీ 14 వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాతో కూడిన మల్టీఫేస్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా సిస్టమ్ లైకా అథెంటిక్, లైకా వైబ్రంట్ అనే 2 విభిన్న ఫోటోగ్రాఫిక్ మోడ్‌కు సపోర్టు ఇస్తుంది. సెల్ఫీలకు 32ఎంపీ ఇన్-డిస్ప్లే కెమెరా కూడా ఉంది.
బ్యాటరీ – ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 4,610ఎంఎహెచ్ బ్యాటరీతో ఆధారితమైనది. 90డబ్ల్యూ హైపర్‌ఛార్జ్, 50డబ్ల్యూ వైర్లెస్ హైపర్‌ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. వేగంగా, సమర్థవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను పొందవచ్చు.
కనెక్టివిటీ, ఆడియో :
షావోమీ 14 డ్యూయల్-సిమ్ సపోర్ట్ (రెండు ఫిజికల్ 5జీ సిమ్‌లు లేదా ఒక ఫిజికల్, ఒక ఇసిమ్), వై-ఫై7, బ్లూటూత్ 5.4తో సహా కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఆడియో ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, మెరుగైన సౌండ్ క్వాలిటీకి 4-మైక్ రేంజ్ ఉన్నాయి.
సాఫ్ట్వేర్ :
ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా హైపర్ఓఎస్తో రన్ అవుతుంది. షావోమీ 14 పవర్ఫుల్ హార్డ్‌వేర్ ఆప్టిమైజ్డ్ సాఫ్ట్‌వేర్‌తో కలిపి యూజర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 14వేల ఫ్లాట్ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ఈ డీల్ ఎలా పొందాలంటే?