Xiaomi 17T Price : బాబోయ్.. షావోమీ 17T ఫోన్ ఏకంగా రూ. 10వేలు పెంపు.. కొత్త ధర ఎంతంటే?
Xiaomi 17T Price : షావోమీ 17టీ సిరీస్ ఫోన్ ధర భారీగా పెరిగింది. 50MP కెమెరా స్మార్ట్ ఫోన్ ఏకంగా రూ. 10వేలు పెరిగింది.. ఇప్పుడు ఫైనల్ ధర ఎంత ఉందో తెలుసా?
- Sreehari A
- Published on- October 1, 2026 / 09:06 PM IST
Xiaomi 17T Price
- భారత మార్కెట్లో షావోమీ 17టీ రూ.59,999 ప్రారంభ ధర ఎంతంటే?
- 50MP ప్రైమరీ కెమెరా, 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా సెటప్
Xiaomi 17T Price : షావోమీ లవర్స్ మీకోసమే.. కొత్త స్మార్ట్‌ఫోన్ షావోమీ 17టీ ధరను భారీగా పెంచింది. ఈ ఏడాది జూన్‌లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ షావోమీ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్, 67W హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీ ఉన్నాయి. లాంచ్ ధరతో పోలిస్తే ఈ షావోమీ ఫోన్ ఎంత ఖరీదైందో ఇప్పుడు తెలుసుకుందాం..
షావోమీ 17టీ ధర :
షావోమీ 17టీలో 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.69,999 కాగా, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999గా ఉంది. లాంచ్ సమయంలో 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999 కాగా, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999గా ఉండేది. లాంచ్ ధరతో పోలిస్తే.. ఈ 2 వేరియంట్ల ధరలు రూ.10వేలు పెరిగాయి. అయితే, లాంచ్ సమయంలో కంపెనీ రూ.5వేలు తగ్గింపుతో లభిస్తుంది.
Read Also : TRAI-Mandated Packs : మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక రీఛార్జ్ ప్లాన్ల కోసం వెతకాల్సిన పని లేదు!
షావోమీ 17టీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
షావోమీ 17టీలో 2756×1268 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ 3 ఉంటుంది. ఇందులో 6500mAh బ్యాటరీ ఉంది. 67W హైపర్‌ఛార్జ్ 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
షావోమీ 17టీ కెమెరా సెటప్ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ఎఫ్/1.7 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP 5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, Wi-Fi 6, బ్లూటూత్ 6.0, NFC, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
