Redmi 17C 5G : వావ్.. కొత్త రెడ్మి ఫోన్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు.. ఫస్ట్ సేల్ డేట్ ఇదే..!
Redmi 17C 5G : రెడ్మి 17సి 5జీ ఫోన్ లాంచ్ అయింది. రెడ్మి 17సీ ఫోన్ 6.9-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. అక్టోబర్ 7, 2026న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
Redmi 17C 5G
- 6.9-అంగుళాల 120Hz అడాప్టివ్‌సింక్ డిస్ప్లే, 6GB ర్యామ్
- 50MP ఏఐ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్
- అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్
Redmi 17C 5G : కొత్త రెడ్మి ఫోన్ కొంటున్నారా? రెడ్మి నోట్ 17 ప్రో సిరీస్ తర్వాత షావోమీ ఎట్టకేలకు భారత మార్కెట్లో రెడ్మి 17సి 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ రెడ్మి ఫోన్ 6,000mAh బ్యాటరీ 5జీ కనెక్టివిటీతో సహా ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను అందిస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు 50MP ఏఐ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. రెడ్మి 17C 5జీ ఫోన్ అక్టోబర్ 7 నుంచి mi.com, Amazon.in, Xiaomi Retailలో అమ్మకానికి వస్తుంది.
రెడ్మి 17సీ 5జీ స్పెసిఫికేషన్లు :
రెడ్మి 17సీ ఫోన్ 6.9-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. 120Hz వరకు అడాప్టివ్‌సింక్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ రెడ్మి ఫోన్ లో-బ్లూ లైట్ ఫ్లికర్ ఫ్రీ సర్కాడియన్ ఫ్రెండ్లీ వ్యూ కోసం టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ అందిస్తుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6GB వరకు ర్యామ్ ఉన్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ సపోర్టు ఉంది. షావోమీ ఇంటర్‌కనెక్టివిటీ (కాల్ సింక్, షేర్డ్ క్లిప్‌బోర్డ్), గూగుల్ జెమిని సర్కిల్ టు సెర్చ్ సపోర్ట్‌తో హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది.
కెమెరాల విషయానికొస్తే.. :
ఈ రెడ్మి ఫోన్ అల్ట్రా హెచ్డీ, పోర్ట్రెయిట్ నైట్ మోడ్లతో 50MP ఏఐ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. సెల్ఫీల కోసం ఇందులో పోర్ట్రెయిట్, నైట్ టైమ్-లాప్స్ మోడ్లతో 8MP కెమెరా అందిస్తుంది. IP64 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్, వెట్ టచ్ టెక్నాలజీ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
రెడ్మి 17C 5జీ ధర ఎంతంటే? :
రెడ్మి 17C ఫోన్ బేస్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 20,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 22,999గా ఉంది. రెడ్మి 17C 5జీ ఫోన్ అక్టోబర్ 7, 2026న మధ్యాహ్నం 12 గంటల నుంచి mi.com, Amazon.in, Xiaomi రిటైల్‌లో అమ్మకానికి వస్తుంది. ఈ రెడ్మి ఫోన్ డార్క్ నైట్, కాఫీ బ్రూ పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
