Kaaka vs Dada : చిరు కాకా.. బాలయ్య దాదా.. ఒకే రోజు?
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కాకా నందమూరి బాలకృష్ణ దాదా (Kaaka vs Dada) ఒకేరోజు బరిలోకి దిగితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ తప్పదు.
gossip garage Chiranjeevi Kaaka and Nandamuri Balakrishna Dada movies releasing on same day
Kaaka vs Dada : మెగాస్టార్ చిరంజీవి కాకా సినిమా ఇప్పటికే 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో బాలకృష్ణ నటిస్తున్న దాదా మూవీని కూడా అదే జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌గా మారింది.
దాదా పిక్చిర్ను ముందుగా డిసెంబర్ 24న రిలీజ్ డేట్‌ను అనుకున్నప్పటికీ.. ఆ తేదీని మార్చి సంక్రాంతి బరిలోకి రావాలనే చర్చ జరుగుతోందట. మరీ ముఖ్యంగా కాకా రిలీజ్ డేట్ అయిన జనవరి 13నే దాదాను కూడా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే దానిపై టీమ్‌లో సీరియస్ డిస్కషన్ జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Sravya Dimple : తెల్ల కాగితం ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రావ్య డింపుల్.. ఫొటోలు వైరల్..
2027 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కాకా..నందమూరి బాలకృష్ణ దాదా ఒకేరోజు బరిలోకి దిగితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ తప్పదు. ఇద్దరు బిగ్ స్టార్స్.. పైగా రెండు భారీ సినిమాలు ఒకే తేదీన బాక్సాఫీస్ బరిలోకి దిగితే థియేటర్ల కేటాయింపు నుంచి ఫ్యాన్స్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ వరకు ప్రతీ దగ్గర కాంపిటీషన్ ఆసక్తికరంగా మారనుంది.
ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రావడం వల్ల సంక్రాంతి రేసు మరింత వేడెక్కే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మాత్రమే. దాదా నిజంగానే జనవరి 13న వస్తుందా?. లేక రిలీజ్ ప్లాన్ మారుతుందా.? అన్నదానిపై మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
