Credit Card Rules : YES బ్యాంకు క్రెడిట్ కార్డు ఉందా? ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. యూజర్లకు బెనిఫిట్స్ ఏంటి?
Yes Credit Card Rules : యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. యుటిలిటీ బిల్లు పేమెంట్లు, రవాణా ఖర్చులు, డిజిటల్ వ్యాలెట్ లోడింగ్ చేయడంపై వర్తించనున్నాయి.
- Sreehari A
- Published On : March 16, 2026 / 03:30 PM IST
Yes Credit Card Rules
- యెస్ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డు రూల్స్
- ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి
- యుటిలిటీ బిల్లులపై కొత్త పరిమితులివే
Yes Credit Card Rules : యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్ ప్రకారం, ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ కొత్త మార్పులతో ప్రధానంగా యుటిలిటీ బిల్లు పేమెంట్లు, రవాణా ఖర్చులు, డిజిటల్ వాలెట్ లోడింగ్ వంటివి మారనున్నాయి.
ప్రస్తుతానికి బ్యాంక్ ఫీజు రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఒక శాతం ఛార్జ్ ప్లస్ జీఎస్టీ మాదిరిగానే ఉంటుంది. కానీ, అనేక కేటగిరీలకు ఖర్చు పరిమితులను పెంచింది. వినియోగదారులు కొత్త ఛార్జీలు అమల్లోకి రాకముందే గతంలో కన్నా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు.
యుటిలిటీ బిల్లులపై కొత్త లిమిట్ :
ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లు పేమెంట్లకు ఇప్పుడు కొత్త లిమిట్స్ వర్తిస్తాయి. ఒకే బిల్లింగ్ సైకిల్‌లో మీ ఖర్చులు ఈ పరిమితిని మించిపోతే ఒక శాతం ఛార్జ్, జీఎస్టీని చెల్లించాలి.
ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ : రూ. 1 లక్ష వరకు
మార్క్యూ, రిజర్వ్ వంటి ప్రీమియం కార్డులు : రూ. 50,000 వరకు
ఇతర YES బ్యాంక్ క్రెడిట్ కార్డులు : రూ. 25,000 వరకు
క్రెడిట్ కార్డుపై మీరు పెట్టే ఖర్చు ఈ పరిమితులను మించితే అదనంగా మొత్తం వసూలు చేస్తుంది. టోల్, బ్రిడ్జి ఫీజుల పేరు మారింది. టోల్ సంబంధిత లావాదేవీలు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లలో ట్రావెల్ రుసుములుగా కనిపిస్తాయి. నెలవారీ ఖర్చు నిర్దేశించిన పరిమితిని మించితే దానిపై ఒక శాతం ఛార్జీ, జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త లిమిట్స్ ఇవే :
- ప్రీమియం కార్డ్ : రూ. 75,000
- ఇతర కార్డులు : రూ. 50,000
- ఏదైనా ఒక లావాదేవీపై గరిష్టంగా ఛార్జీ రూ. 5,000 వరకు మాత్రమే ఉంటుంది.
- మీ వ్యాలెట్‌లో డబ్బులు యాడ్ చేసినా ఛార్జీలు చెల్లించాలి.
- క్రెడిట్ కార్డ్ ద్వారా థర్డ్-పార్టీ డిజిటల్ వ్యాలెట్‌లో డబ్బు డిపాజిట్ చేసినా ఈ రూల్స్ వర్తిస్తాయి.
- 2,000 వరకు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు.
- 2,000 దాటితే ఒక శాతం ఛార్జీ, జీఎస్టీ కూడా వర్తిస్తుంది.
- ఈ ఛార్జీ కూడా ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 5,000 వరకు పరిమితి ఉంటుంది.
కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి? :
ఈ మార్పులతో యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇప్పుడు యుటిలిటీ, రవాణా ఖర్చుల పరిమితులు పెరిగాయి. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా పెద్ద మొత్తంలో పేమెంట్లు చేయొచ్చు. అలాగే లిమిట్స్ దాటితే అదే ఛార్జీలు వర్తిస్తాయి. క్రెడిట్ కార్డ్ వాడే కస్టమర్‌లు తమ ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
