YouTube PiP : iPhone, iPad యూజర్లకు YouTube PiP ఫీచర్.. యాప్ క్లోజ్ చేసినా వీడియోలు చూడొచ్చు..!

ప్రముఖ గూగుల్ సర్వీసులో ఒకటైన యూట్యూబ్ యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. YouTube పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్.. ఇప్పటికే వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

YouTube PiP : ప్రముఖ గూగుల్ సర్వీసులో ఒకటైన యూట్యూబ్ యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. YouTube పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్.. ఇప్పటికే వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అమెరికాలో ఉన్న యూజర్ల అందరికి ఈ ఫీచర్ ఉచితంగా లభిస్తుంది. కానీ, సంగీతేర కంటెంట్ కోసం మాత్రమే గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. PiP మోడ్ YouTube యాప్‌ను క్లోజ్ చేసిన తర్వాత కూడా వీడియోలను చూసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ కొత్త PiP మోడ్ ఫీచర్ చాలా మంది యూజర్లకు ఇప్పటికీ అందుబాటులో లేని ఫీచర్. అమెరికాలో నివసిస్తున్న Youtube యూజర్లు ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చునని కంపెనీ ధృవీకరించింది.

YouTube ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ కూడా అవసరం లేదు. PiP మోడ్‌లో సంగీతేతర కంటెంట్‌ను చూడవచ్చు. ఇతర మార్కెట్‌లలో ఉన్న యూజర్లు అన్ని వీడియోలను PiP మోడ్‌లో చూసేందుకు YouTube సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. యూజర్లు యాడ్స్ లేకుండా YouTubeలో వీడియోలను చూడవచ్చు. అంతేకాదు.. YouTube Music సభ్యత్వాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. PiP ఫీచర్‌.. iOS, iPadOS ప్లాట్‌ఫారమ్‌లకు కూడా రిలీజ్ చేయనున్నట్టు Google వెల్లడించింది.

Youtube’s Picture In Picture Feature Is Now Available For Iphone And Ipad Users

ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికే ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీ డివైజ్ iOS 15 ఉంటే.. మీరు మాత్రమే PiP ఫీచర్‌ను యాక్సస్ చేసుకోవచ్చు. PiP ఫీచర్ ఎక్కువగా డిఫాల్ట్‌గా లాంచ్ అయింది. ఒకవేళ ఫీచర్ మీకు కనిపించకపోతే.. మీరు దాన్ని మాన్యువల్‌గా ఆన్ చేయవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు మీ YouTube యాప్‌లో Settings> జనరల్‌కి వెళ్లి ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు. దీని తర్వాత, మీరు ఈ ఫీచర్ ఓపెన్ చేయవచ్చు.

మీరు వీడియోను చూస్తున్నప్పుడు యాప్‌ను క్లోజ్ చేసినా PiP మోడ్ ఆటోమాటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. కేవలం చూసేందుకు YouTube వీడియోను మాత్రమే ఎంచుకోవాలి. YouTube యాప్‌ను క్లోజ్ చేయవచ్చు. అప్పుడు ఓపెన్ చేసిన వీడియో చిన్న విండోలో ప్లే అవుతూనే ఉంటుంది. మీరు ఇతర యాప్‌లను ఓపెన్ చేసినప్పుడు కూడా మీ డివైజ్ స్క్రీన్‌పై వీడియో అలానే ప్లే అవుతుంటుంది.

Read Also : YouTube Records: రిలీజ్‌కు ముందే రికార్డులు.. స్టార్ హీరోలకు సోషల్ మీడియా పరీక్ష!

ట్రెండింగ్ వార్తలు