IAS officers Transfered
IAS Officers Transfer : తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశం, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి, మున్సిపల్ శాఖ ప్రన్సిపల్ సెక్రటరీగా దాన కిశోర్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ బదిలీ చేశారు.
జీఐడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఆర్ ఆండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా బదిలీ అయ్యారు. ఇక నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్ వీ కన్నన్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా నియమించారు. మరోవైపు రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరితోపాటు మరో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు కూడా స్థాన చలనం కలిగింది.
IPS Officers : తెలంగాణలో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల్లో జంట నగరాల్లో పని చేస్తున్నపలువురు డీసీపీలు ఉన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్‌గా ఏవీ రంగనాథ్, వెస్ట్‌జోన్ డీసీపీగా విజయ్‌కుమార్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా జ్యోయల్ డెవిస్, నార్త్‌జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, డీసీపీ డీడీగా శ్వేత, ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడు నియమితులయ్యారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితపంత్, సిట్ చీఫ్ గజారావు భూపాల్‌ను డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీ బాలాదేవి, మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్ రావును రైల్వేస్ అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీగా ఉన్న విశ్వ ప్రసాద్ ని ట్రాఫిక్ అడిషనల్ సీపీగా బదిలీ చేశారు.