IPS Officers : తెలంగాణలో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీ బాలాదేవి, మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్ రావును రైల్వేస్ అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీగా ఉన్న విశ్వ ప్రసాద్ ని ట్రాఫిక్ అడిషనల్ సీపీగా బదిలీ చేశారు.

IPS officers transfer
IPS Officers Transfer : తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరితోపాటు మరో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు కూడా స్థాన చలనం కలిగింది. బదిలీ అయిన వారిలో జంట నగరాల్లో పని చేస్తున్నపలువురు డీసీపీలు ఉన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్‌గా ఏవీ రంగనాథ్, వెస్ట్‌జోన్ డీసీపీగా విజయ్‌కుమార్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా జ్యోయల్ డెవిస్, నార్త్‌జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, డీసీపీ డీడీగా శ్వేత, ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడు నియమితులయ్యారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితపంత్, సిట్ చీఫ్ గజారావు భూపాల్‌ను డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
CP Srinivas Reddy: 2 నెలల్లో హైదరాబాద్‌లో వీటిని పూర్తిగా నిర్మూలించాలి: సీపీ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీ బాలాదేవి, మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్ రావును రైల్వేస్ అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీగా ఉన్న విశ్వ ప్రసాద్ ని ట్రాఫిక్ అడిషనల్ సీపీగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న విజయ్ కుమార్ వెస్ట్ జోన్ డీసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. హైదరాబాద్ జాయింట్ సీపీగా రంగనాథ్ కి పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్
డీసీపీగా జోయల్ డేవిస్ బదిలీ అయ్యారు. మెదక్ ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్శినిని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా నియమించారు. సిద్దిపేట్ సీపీగా ఉన్న శ్వేతని హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ డిసీపీగా సుబ్బరాయుడికి పోస్టింగ్ ఇచ్చారు. మొత్తం పది ఐపీఎస్ లు, మరో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీను బదిలీ చేశారు.