CP Srinivas Reddy: 2 నెలల్లో హైదరాబాద్‌లో వీటిని పూర్తిగా నిర్మూలించాలి: సీపీ శ్రీనివాస్ రెడ్డి
ఇలాంటి కేసులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాంటి కేసుల్లో..

Hyderabad CP Kothakota Srinivas Reddy
Hyderabad CP: హైదరాబాద్ సీపీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మించాలని చెప్పారు. పోలీసు అధికారులతో సమావేశమై ఈ ఆదేశాలు ఇచ్చారు.
నగరంలో డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో డ్రగ్స్, గంజాయి అనే మాటలు వినపడకూడదని అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అనేది వర్తిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కాగా, డ్రగ్స్ కేసులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాంటి కేసుల్లో ఎంతటి వారున్నా వారిని వదలొద్దని చెప్పారు. ఈ మేరకు పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy: రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఏఏ విషయాలపై చర్చించారంటే