తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు… తొమ్మిది మంది మృతి

  • Publish Date - July 11, 2020 / 11:15 PM IST

తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందారు. ఇవాళ కరోనా నుంచి మరో 1714 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 736 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 348 మృతి చెందారు.

ప్రస్తుతం తెలంగాణలో 12,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20,919 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికీ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 11,066 శాంపిల్స్ సేకరించారు. వీటిలో 1178 పాజిటివ్ కేసులు నమోదవ్వగా మిగితావన్ని కూడా నెగెటివ్ గా పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, హైదరాబాద్ లో 736 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి 125, మేడ్చల్ 101, కరీంనగర్ 24, సిరిసిల్ల 24, వరంగల్ అర్బన్ 20, మెదక్ 22, ఖమ్మం 18, మంచిర్యాల 17, ఆదిలాబాద్ 14, మహబూబ్ నగర్ 14, నిజామాబాద్ 12 మంది కరోనా బారిన పడ్డారు.

వికారాబాద్ 9, సిద్దిపేట 9, ఆదిలాబాద్ 8, సూర్యపేట 7, గద్వాల 6, నారాయణపేట 5, ఖమ్మం 2, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 2, జగిత్యాల 2, జనగామ 2, వనపర్తి 2, ఆసిఫాబాద్ లో ఒక కేసు నమోదు అయింది. గత 15..20 రోజులుగా చూసినట్లైతే ఇవాళ కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.