Medaram Devotees Rush : భక్తుల రద్దీతో మేడారం కిటకిట.. భారీ ఎత్తున ట్రాఫిక్ జాం.. 12 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Medaram Devotees Rush : మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తజనం తరలివస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలు గంటలకొద్ది నిలిచిపోయాయి. భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయింది.

12 km long traffic jam greets Medaram pilgrims Over Devotees rush

Medaram Devotees Rush : భక్తుల రద్దీతో మేడారం కిటకిటలాడుతోంది. మహాజాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు అత్యధిక సంఖ్యలో తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. ఈ క్రమంలో మేడారం పరిసర ప్రాంతాల్లోని రోడ్లన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి.

Read Also : Medaram Jathara 2024 : మేడారం మహాజాతర షురూ.. పోటెత్తిన భక్తజనం..

ఫలితంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. వాహనాల రాకపోకలు స్తంభించి తాడ్వాయి నుంచి మేడారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 12 కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.గంటల తరబడి ఎక్కడి వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మేడారం జాతరలో సౌకర్యాలు కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పోలీసుల ఓవరాక్షన్‌తో దర్శనం కోసం వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిల్చుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Read Also : CM Revanth Reddy : ప్రధాని మోదీ, అమిత్ షాను మేడారం జాతరకు ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు