Telangana : వీధి కుక్కల దాడిలో 10మంది చిన్నారులతో 12మందికి గాయాలు

ఇష్టానుసారంగా దాడిచేస్తున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితికి భయపెతున్నాయి.

stray dogs attack

Telangana : ఈ వీధి కుక్కలకు ఏమైంది? కనిపించినవారినల్లా కొరికేస్తున్నాయి. ఇష్టానుసారంగా దాడిచేస్తున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితికి భయపెతున్నాయి. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడిలో గాయపడేవారి పరిస్థితి పెరుగుతోంది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వీధికుక్కలు స్వైరవిహారానికి జనాలు భయపడిపోతున్నారు. అడవుల్లోంచి గ్రామాల్లోకి పులులు వచ్చిన వాటి వెంటపడే జనాలు వీధికుక్కలను చూస్తే మాత్రం భయడిపోయే పరిస్థితి నెలకొంది.

జిల్లాలోని గాయత్రినగర్, మిర్చి కాంపౌండ్, కోట గల్లీల్లో కుక్కలు ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఆ దారివెంటపోయేవారిపై దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ గాయపడినవారిలో 10మంది పిల్లలు కూడా ఉన్నారు.

హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఈ నగర వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా వివాదాస్పదమైంది. ముఖ్యంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడికి ఎంతోమంది గురి అవుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ నిర్వాహణపై విమర్శలు వస్తున్నాయి. చర్యలు తీసుకోకుండా జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కుక్కల దాడిలో బాలుడి మృతిపై మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలా వీధికుక్క దాడుల సమస్యలు అటు జీహెచ్ ఎంసీకి సవాలుగా మారుతుంటే ప్రజలు మాత్రం భయాందోళనలకు గురి అవుతున్నారు.